Karthika Deepam 15 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు 15 సెప్టెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1145 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఇంటికి వెళ్లి పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు. పిల్లలతో కార్తీక్ ఉండటం చూసి ఆనంద రావు ఆనందంతో తబ్బిఉబ్బిబ్బయిపోతాడు. వెంటనే సౌందర్య దగ్గరికి వెళ్లి.. నాకు అయితే ఆనందం పట్టలేకపోతోంది. అందరూ ఒకచోట ఉండి ప్రశాంతంగా ఉండటం చూసి నాకు ముచ్చట వేస్తోంది అని చెబుతాడు ఆనంద రావు. అవునండి.. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. వాళ్ల సమస్య ఇంకా పూర్తిగా తీరిపోలేదు. మోనిత ఉన్నంత కాలం వాళ్ల సమస్యలు తీరవు. అనగానే మోనిత గురించి నువ్వు ఇంకా భయపడుతున్నావా? అని అంటాడు ఆనంద రావు. కడుపులో బిడ్డతో మళ్లీ వస్తా అని చెప్పి మరీ వెళ్లింది. మోనిత ఎంతకైనా దిగజారుతుంది. ఎంతకైనా తెగిస్తుంది.. దీప నమ్మలేదు కాబట్టి సరిపోయింది కానీ.. దీప నమ్మకపోయి ఉంటే అప్పుడు ఏం జరిగి ఉండేదో.. అంటూ మోనిత గురించి తెగ భయపడుతుంది సౌందర్య.
కార్తీక్ ను దక్కించుకోవడం కోసం మోనిత ఎన్నో కుట్రలు పన్నింది. ఇంత చేసింది రేపు బిడ్డతో సహా.. ఇంట్లో అడుగు పెడితే ఏం చేస్తాం.. అని అంటుంది సౌందర్య. నువ్వు ఎప్పుడో ఏదో జరుగుతుందని టెన్షన్ పడుతున్నావా? అంత దూరం ఆలోచించకు. హ్యాపీగా ఉండు.. అని ఆనంద రావు సర్దిచెబుతాడు.
నాన్నా.. ఆ రోజు మా ఇద్దరిని దగ్గరికి తీసుకొని మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదాం అన్నావు కదా.. ఎప్పుడు వెళ్లిపోదాం.. అని అడుగుతుంది శౌర్య. వెళ్దాం తప్పకుండా వెళ్దాం అంటాడు కార్తీక్. దీంతో పిల్లలు సంతోషంగా వెళ్లి పడుకుంటారు. ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది దీప. ఈ ఊళ్లో నాకు ఉన్న పేరు, గౌరవం మొత్తం పోయింది. మోనితతో చేసిన సావాసం వల్ల నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో నీకు తెలుసు. ఇక్కడే ఉంటే మోనిత ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటుంది.. అని కార్తీక్ అనగానే.. మోనితకు భయపడి ఎక్కడికైనా వెళ్తారా? అని అడుగుతే.. ఎంత దూరంగా ఉన్నా ఆ మోనిత నన్ను వదిలిపెట్టదు అంటాడు కార్తీక్.. ఇంతలోనే సౌందర్య అక్కడికి వస్తుంది. ఏంటి మీరు ఏదో వాదించుకుంటున్నారు.. అని అనగానే.. చూడండి అత్తయ్య.. మోనితకు భయపడి ఎక్కడికో వెళ్తా అంటున్నాడు అంటుంది దీప.
యూఎస్ వెళ్దామనుకుంటున్నాను అమ్మ అంటాడు కార్తీక్. యూఎస్ అయితేనే నేను ప్రశాంతంగా ఉంటాను. ఆ మోనిత పీడ కూడా నాకు విరగడ అవుతుంది. తను అక్కడికి అయితే రాలేదు.. తనకు వీసా కూడా రాదు.. అని అంటాడు కార్తీక్. ఇది కరెక్ట్ కాదు డాక్టర్ బాబు. అసలు మోనిత నన్ను బంధించినప్పుడు ఏం జరిగిందో మీకు చెప్పలేదు కదా.. అంటూ మోనిత ముందు దీపను బంధించినప్పుడు ఏం జరిగిందో చెబుతుంది దీప.
వద్దు నన్ను చంపొద్దు. నేను చచ్చిపోతే నేనొక్కదాన్నే పోను దీప.. నా బిడ్డ కూడా చచ్చిపోతుంది. నన్ను కార్తీక్ పెళ్లి చేసుకుంటానని రెండు సార్లు మాటిచ్చాడు కదా. 16 ఏళ్ల నుంచి పిచ్చిగా ప్రేమించిన దాన్ని. నేను కాదు.. నా కార్తీకే నన్ను మోసం చేశాడు.. అంటూ మోనిత.. దీపకు చెప్పిన విషయాన్ని కార్తీక్ కు చెబుతుంది దీప. తన గురించి ఆలోచిస్తే కాస్త జాలి అంటూ.. అని దీప చెప్పగానే స్టాప్ ఇట్.. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరి మీద నీకు జాలి.. వద్దు.. తన మీద ఎందుకు నీకు జాలి. ఆమె ఏం ఉద్దరించిందని జాలి.. అంటూ దీప మీద సీరియస్ అవుతాడు కార్తీక్.
కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో లాకప్ లో ఉంటుంది మోనిత. ఇంతలో రత్నసీత.. అంటూ మోనిత పిలుస్తుంది. నాకు ఒక హెల్ప్ చేయాలి.. అని అడుగుతుంది మోనిత. నేను చాలా రిస్క్ లో పడతాను.. నన్ను వదిలేయండి మేడమ్.. అంటే అది కాదు.. అనగానే వద్దు మేడమ్.. మా అక్క ప్రాణాలు కాపాడారనే ఒకే ఒక్క కారణంతో మీకు ఇన్ని రోజులు సాయం చేశాను.. వద్దు మేడమ్ ఇక వదిలేయండి.. అని అంటే.. నీకేం కాదు రత్నసీత. నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు.. నేను చెప్పింది చేయి అని తనకు ఏదో చెబుతుంది. దీంతో రిస్క్ మేడమ్.. అయినా నేను ఇప్పుడు వెళ్లను.. ఉదయమే వెళ్తాను.. అని చెబుతుంది రత్నసీత. అయినా అంత పిరికితనం వద్దు రత్నసీత అని అంటే.. అది పిరికితనం కాదు అంటూ చెబుతుంది రత్నసీత.
కట్ చేస్తే.. తెల్లారుతుంది. దీప.. చక్కగా రెడీ అయి తులసి పూజ చేస్తుంది. పెళ్లయిన కొన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు నా కాపురంలో కలతలు దూరం అయ్యాయి. నా భర్త, నా పిల్లలు, నా అత్తగారి కుటుంబం అందరూ సంతోషంగా ఉండేలా కాపాడు తల్లి. నా ఇంటి మీద ఎటువంటి దుష్టశక్తి నీడ కూడా పడకుండా మమ్మల్ని రక్షించు.. అని వేడుకుంటుండగానే అక్కడికి రత్నసీత వస్తుంది. ఎలా ఉన్నారు.. అని అడుగుతుంది. డాక్టర్ సార్ ను చూడాలని వచ్చాను దీప గారు. సార్ ను కలవొచ్చా.. అని అడిగితే మీ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి రూల్స్ మా ఇంట్లో లేవు అంటుంది దీప. దీపతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది రత్నసీత.
నేనేమైనా తప్పు చేస్తున్నానా. నా కార్తీక్ మీద ప్రేమతోనే కదా.. ఇదంతా చేస్తున్నా. ఎందుకు డాక్టర్ బాబు నన్ను పట్టించుకోవడం లేదు. అందం, ఐశ్వర్యం ఉన్న నన్ను వదిలేసి.. ఆ వంటలక్క వెంట ఎందుకు పడుతున్నాడు. నాతో సహజీవనం చేసినా చాలు.. కానీ.. ఎందుకు కార్తీక్ నన్ను పట్టించుకోవడం లేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అయినా తనను నావాడిని చేసుకుంటాను.. అనుకుంటుంది మోనిత.
ఇంతలో ఏసీపీ వచ్చి… మోనిత మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఈరోజు కోర్టుకు తీసుకెళ్లాలి.. అని చెబుతుంది ఏసీపీ. ఇంతలో మోనిత ఉండి.. మేడమ్ మేడమ్ మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా.. అని అడుగుతుంది. దీంతో తనను నా క్యాబిన్ కు పంపించండి.. అని అంటుంది రోషిణి.
కట్ చేస్తే.. ఇంట్లో కూర్చొని కాఫీ తాగిన రత్నసీత.. మోనిత చెప్పిన పని చేసేందుకు సిద్ధం అవుతుంది. అక్కడ టేబుల్ మీద ఉన్న దీప ఫోన్ ను తీసుకొని దీప ఫోన్ లో మోనిత అంజిని బెదిరించిన వీడియోను డిలీడ్ చేసి వెంటనే ఫోన్ అక్కడ పెడుతుంది. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. డాక్టర్ సాబ్ ఇంకా లేచినట్టు లేరు. నేను బయలు దేరుతాను.. మళ్లీ ఎప్పుడైనా వస్తా.. అని అంటుంది రత్నసీత.
ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఎలా ఉన్నారు సార్.. చాలా సంతోషం డాక్టర్ సార్. మీరు బాగుండాలి.. అని అంటుంది రత్నసీత. ఇంతలో ఆనంద రావు, సౌందర్య అక్కడికి వస్తారు. రత్నసీత గురించి.. తను కార్తీక్ కు చేసిన సేవ గురించి కార్తీక్ అందరికీ చెబుతాడు. అవును.. నువ్వు నా కొడుకును సొంత మనిషిలా చూసుకున్నావు.. అంటూ రత్నసీతకు సౌందర్య చెబుతుంది. డాక్టర్ గారు నిర్దోషిగా రిలీజ్ అవ్వడానికి మాకంటే దీప గారే ఎక్కువగా కష్టపడ్డారు.. అంటుంది రత్నసీత. ఈ క్రెడిట్ అంతా ఆవిడదే అంటుంది రత్నసీత.
ఆ తర్వాత నిలబడి.. తను తీసుకొచ్చిన కవర్ ను కార్తీక్ కు ఇస్తుంది. ఏంటది అని అడుగుతాడు కార్తీక్. అవును సార్.. నేను తేలేదు.. అంటే నేను మీదగ్గరికి వస్తున్నాను అని తెలిసి వద్దన్నా వినకుండా మోనిత మేడమ్ ఈ బ్యాగ్ ఇచ్చి పంపించారు.. అనగానే అందరూ లేచి నిలబడతారు.
కట్ చేస్తే.. రత్నసీత పోలీస్ స్టేషన్ కు వస్తుంది. ఇంకో గంటలో మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లమని మా మేడమ్ చెప్పారు.. అని మోనితతో చెబుతుంది రత్నసీత. కార్తీక్ కూడా వస్తున్నాడా.. అని అడుగుతుంది మోనిత. దీంతో అవును అంటుంది రత్నసీత. కట్ చేస్తే.. కార్తీక్ కోర్టుకు వెళ్లి వస్తా అని చెబుతాడు.
నువ్వు బయటికి వెళ్తుంటేనే నాకు ఏదో అవుతోంది. నువ్వు మళ్లీ వస్తావు కదా.. అంటూ శౌర్య అడుగుతుంది. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.