Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర అనే పేర్లు ఇచ్చింది జబర్దస్త్ షోనే. అంటే మల్లెమాలనే. అంటే ఈటీవీనే. ఇలా ఈటీవీ, మల్లెమాల, జబర్దస్త్ వంటి వాటితో ఎంతో మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక మధ్యలో కొన్ని కారణాల వల్ల పక్క చానెళ్లకు వెళ్లడం జరిగింది. ఇందులో చమ్మక్ చంద్ర అయితే ఎప్పుడో వెళ్లిపోయాడు. నాగబాబుతో కలిసి అదిరింది, బొమ్మ అదిరింది అంటూ తిరిగాడు. ఇక ఇప్పుడు సైలెంట్‌గా కామెడీ స్టార్స్ షోను చేసుకుంటున్నాడు.
సుధీర్ కూడా ఈ మధ్యే స్టార్ మాలోకి వచ్చాడు. మల్లెమాల, ఈటీవీతో ఏం జరిగిందో తెలియదు గానీ సుధీర్ బయటకు వచ్చేశాడు. రెమ్యూనరేషన్ కోసం బయటకు వచ్చాడన్నట్టుగా ఆది, రాం ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తానని అన్నారేమో.. అందుకే వెళ్లాడేమో అంటూ సుధీర్ గురించి రాం ప్రసాద్, ఆదిలు చెప్పుకొచ్చారు. అయితే జబర్దస్త్ షోలో అవనమానాలు, మల్లెమాలలో గుర్తింపు లేకపోవడంతో సుధీర్ అలా బయటకు వెళ్లిపోయాడనే టాక్ ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చింది.
అయితే సుధీర్ ఇకపై ఎప్పటికీ కూడా మల్లెమాల ఈవెంట్లలో పాల్గొనడని, ఈటీవీ ఈవెంట్లలో కనిపించడని అంతా అనుకున్నారు. ఇక చమ్మక్ చంద్ర అయితే ఎప్పుడూ కూడా రాలేడని అంతా భావించారు. కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేశారు. ఇది ఎవరి ప్లానింగ్ అన్నది తెలియడం లేదు.. గానీ సుధీర్, చంద్రలు వచ్చేశారు. అది కూడా ఈటీవీ మీదున్న ప్రేమతోనే అని తెలుస్తోంది. ఈటీవీ 27వ వార్షికోత్సవం అంటూ ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. భలే మంచి రోజు అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో సుధీర్, చంద్రలు కనిపించారు.
భలే మంచి రోజు అనే ఈ ఈవెంట్‌కు ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈటీవీ మీదున్న రుణానుబంధంతోనే సుధీర్, చంద్రలు వచ్చారేమో. ప్రోమోలో వీరి ఎంట్రీ, ఈవెంట్‌లో వీరి సందడి మామూలుగా ఉండబోవడం లేదనిపిస్తోంది. దీంతో సుధీర్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతన్నారు. అయితే ఇది కేవలం ఈ ఒక్క ఈవెంట్‌కు అన్నట్టు తెలుస్తోంది.
Lemon Water : నిమ్మకాయ నీరు సాధారణంగా ఫిట్నెస్ ఔత్సాహికులందరినీ ఏకం చేస్తుంది. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం నుంచి…
Eye Blurry : ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం చాలా మందికి జరుగుతుంది. చాలా…
Samantha : దక్షిణాది బ్యూటీ సమంత ఇప్పటికీ టాలీవుడ్లో క్రేజీ భామగానే ఉంది. ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్…
Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీ అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువగా వినియోగించే పానీయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ అధిక…
Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
This website uses cookies.