
Dil Raju comments on nikhil karthikeya 2 movie collections
karthikeya 2 Movie : నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది అనుకున్న సమయంలో రిలీజ్ డేట్ విషయంలో నానా ఇబ్బందులు ఎదురయ్యాయి. మొదట థాంక్యూ సినిమా కోసం కార్తికేయ 2 ని వాయిదా వేయాల్సి వచ్చిందట. ఆ తర్వాత మాచర్ల నియోజక వర్గం సినిమా కోసం ఒక్క రోజు ఆలస్యంగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. మాచర్ల సినిమా ప్రమోషన్ సమయంలో కార్తికేయ 2 సినిమా వాయిదా వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారంటూ గుసగుసలు వినిపించాయి. కాని ఒక్క రోజు ఆలస్యంగా సినిమాను తీసుకు వచ్చారు. కార్తికేయ 2 సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా భారీ ఎత్తున వసూళ్లను నమోదు చేస్తుంది.
ఈ సమయంలో దిల్ రాజు సినిమా యొక్క మీడియా సమావేశం లో హాజరు అయ్యి కార్తికేయ 2 ను తొక్కేసేందుకు తాను ప్రయత్నించాను అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. కార్తికేయ 2 సినిమా ను తొక్కేయాలనే ఉద్దేశ్యం తనకు లేదు.. అలా చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా స్పష్టతను ఇచ్చాడు. అక్కడి వరకు రాకుండానే దిల్ రాజు ఎందుకు స్పందించింది అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు ఈ విషయంలో దిల్ రాజు అత్యుత్సాహం చూపించి స్పందించడం ద్వారా ఆయనే నిజమైన దోషి అన్నట్లుగా నిలవాల్సి వచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Dil Raju comments on nikhil karthikeya 2 movie collections
సోషల్ మీడియాలో దిల్ రాజు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు కూడా దిల్ రాజు తన సినిమా లు ఉన్నప్పుడు చిన్న సినిమా లను తొక్కేస్తున్నాడు.. తొక్కేస్తాడు అనే టాక్ ఉంది. ఇప్పుడు కార్తికేయ 2 సినిమాకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. కనుక కచ్చితంగా నిజంగానే కార్తికేయ 2 సినిమా వాయిదా వెనుక దిల్ రాజు ఉంటాడు.. కార్తికేయ 2 కి మంచి థియేటర్లు లభించకుండా కూడా ప్రయత్నాలు చేసి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్తికేయ 2 సినిమా ను ఎంతగా ఆపాలని చూసినా కూడా ఆగకుండా దూసుకు వచ్చింది.. సూపర్ హిట్ అయ్యింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.