Sudigali Sudheer : మ‌ల్లెమాల‌కు కోలుకోలేని దెబ్బ‌.. ఆ ఛాన‌ల్ లోకి సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ జంప్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : మ‌ల్లెమాల‌కు కోలుకోలేని దెబ్బ‌.. ఆ ఛాన‌ల్ లోకి సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ జంప్..

Sudigali Sudheer : రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. ఈ బుల్లితెర జంటకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్, ఢీ మాత్రమే కాదు అప్పుడప్పుడూ వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ వీరిద్దరిదే సందడి ఉంటుంది. రష్మీ, సుధీర్ జోడి కోసమే చాలా మంది ఈ కార్యక్రమాలు చూస్తుంటారు. ఈ జోడి ఓ రేంజ్ లో ఎంట‌ర్టైన్ చెస్తోంది మ‌రి. కాగా వీరి ల‌వ్ స్టోరీలో నిజ‌మెంతో తెలియ‌దు కానీ.. రష్మీ, సుధీర్ ఒకరిపై మరొకరు ఎన్నో సార్లు తమ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :13 March 2022,10:00 am

Sudigali Sudheer : రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. ఈ బుల్లితెర జంటకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్, ఢీ మాత్రమే కాదు అప్పుడప్పుడూ వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ వీరిద్దరిదే సందడి ఉంటుంది. రష్మీ, సుధీర్ జోడి కోసమే చాలా మంది ఈ కార్యక్రమాలు చూస్తుంటారు. ఈ జోడి ఓ రేంజ్ లో ఎంట‌ర్టైన్ చెస్తోంది మ‌రి. కాగా వీరి ల‌వ్ స్టోరీలో నిజ‌మెంతో తెలియ‌దు కానీ.. రష్మీ, సుధీర్ ఒకరిపై మరొకరు ఎన్నో సార్లు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. వీరి లవ్ స్టోరికి మాత్రం తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఢీ షోలో జంట చేసే సంద‌డి అంతా ఇంత కాదు. యాంక‌ర్ ప్ర‌దీప్ వీర‌పై వేసే పంచులు అంతే అద్భుతంగా పేలుతాయి. జ‌డ్జీలు సైతం ర‌ష్మీ, సుధీర్ ల‌పై పంచులు విసురుతారు.

జబర్దస్త్ కామెడీ షోలో ఎంతో పాపులారిటీ ఉన్న జోడి ఎవరు అంటే ఏ మాత్రం ఆలోచించకుండా రష్మీ సుధీర్ జంట అని అంతా టక్కున చెప్పేస్తారు. బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సుధీర్ స్క్రీన్ పై కనిపించారంటే అభిమానులకు పూనకాలు వస్తాయి. అటు సోషల్ మీడియాలో కూడా వీళ్లకు మంచి ఫాలోయింగ్ ఉంది.మల్లెమాల ఏ ఈవెంట్ నిర్వహించిన అందులో రష్మీ సుధీర్ కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా పలుసార్లు రష్మీ సుధీర్ కు పెళ్లి అంటూ వార్తలు అటు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం మ‌ల్లెమాల సైతం స్పెష‌ల్ ఈవెంట్ల‌కు సుధీర్‌ను దూర పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఈటీవీలో మల్లెమాల చేస్తోన్న హోళీ ఈవెంట్ ప్రోమో వచ్చింది.

Sudigali Sudheer and Rashmi Gautam jump star maa holi thaggedele 2022 event

Sudigali Sudheer and Rashmi Gautam jump star maa holi thaggedele 2022 event

Sudigali Sudheer : అటు సోషల్ మీడియాలో..

రంగ్ దే అంటూ వచ్చిన ఈ ఈవెంట్‌లో సుధీర్ కనిపించలేదు. సుధీర్ ఎక్కడా? అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లతో మల్లెమాల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.అయితే ఇప్పుడు ఈ లాంటి ఈవెంటే స్టార్ కూడా అందిస్తోంది. ఈ హోళికి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. సుధీర్ రష్మీ జోడిని స్టార్ మాకు తీసుకొచ్చేశారు. తగ్గేదేలే అంటూ యాంకర్ రవి, రష్మీ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో సుధీర్ కనిపించాడు. సుధీర్, రష్మీ ఎమోషనల్ బాండింగ్‌ను బాగానే ఎలివేట్ చేశారు. రష్మీ కోసం సుధీర్ పాట పాడటం, రష్మీ దిష్టి చుక్క పెట్టేయడం అన్నీ కూడా బాగున్నాయి.ఈ దెబ్బతో మల్లెమాల చేస్తోన్న హోళీ పండుగ ఈవెంట్‌కు అంత‌గా క్రేజ్ ఉండ‌క‌పోవ‌చ్చున‌ని టాక్‌ . మొదటి సారిగా స్టార్ మా ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా సోష‌ల్ మీడియాలో ఈ ఈవెంట్ రికార్డులు క్రియేట్ చేస్తుందని సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది