Sudheer Rashmi Gautam : ఇక ఆగేదే లేదు.. ఆ రోజు కీల‌క విష‌యం చెప్ప‌బోతున్న సుడిగాలి సుధీర్-ర‌ష్మీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudheer Rashmi Gautam : ఇక ఆగేదే లేదు.. ఆ రోజు కీల‌క విష‌యం చెప్ప‌బోతున్న సుడిగాలి సుధీర్-ర‌ష్మీ

 Authored By ramu | The Telugu News | Updated on :13 January 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Sudheer Rashmi Gautam : ఇక ఆగేదే లేదు.. ఆ రోజు కీల‌క విష‌యం చెప్ప‌బోతున్న సుడిగాలి సుధీర్-ర‌ష్మీ

Sudheer Rashmi Gautam : సుడిగాలి సుధీర్‌, రష్మి గౌతమ్‌ జంటకి బుల్లితెరపై ఉన్న క్రేజ్‌ మామూలు కాదు. వీరిద్దరికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. జబర్దస్త్ షో ద్వారా ఈ ఇద్దరు పాపులర్‌ అయ్యారు. ఇందులో తమ లవ్‌ ట్రాక్‌ నడిపిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ షోకి హైప్‌ తీసుకొచ్చారు. రేటింగ్‌ని పెంచడంలో కీలకపాత్ర పోషించారు. వీరి కోసమే షో చూసే ఆడియెన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గతంలో స్మాల్ స్క్రీన్ పై సుధీర్ స్టార్ హీలను మించిన ఇమేజ్ ను సాధించాడు అయితే ఈ యంగ్ స్టార్ కు రష్మి తోడై.. వీరిపై రకరకాల ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. వీరి లవ్ ఎపిసోడ్స్ కు భారీగా రెస్పాన్స్ రావడంతో వీరిపై ప్రత్యేకంగా ప్రేమ పెళ్ళి ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేశారు డైరెక్టర్లు.

Sudheer Rashmi Gautam ఇక ఆగేదే లేదు ఆ రోజు కీల‌క విష‌యం చెప్ప‌బోతున్న సుడిగాలి సుధీర్ ర‌ష్మీ

Sudheer Rashmi Gautam : ఇక ఆగేదే లేదు.. ఆ రోజు కీల‌క విష‌యం చెప్ప‌బోతున్న సుడిగాలి సుధీర్-ర‌ష్మీ

Sudheer Rashmi Gautam ర‌చ్చ మాములుగా లేదు..

గతంలో హీరోలకు స్నేహితుడి పాత్రల్లో కనిపించాడు సుధీర్. హీరోగా ఇంటర్డ్యూస్ అయిన తరువాత కూడా సుధీర్ కు ఇలాంటి అవకాశాలే వస్తున్నాయని తెలుస్తోంది. దాంతో మరోసారి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. అంతే కాదు మళ్ళీ తన క్రేజ్ ను.. హైప్ ను పెంచుకోవడం కోసం రష్మీతో జత కలిశారు. ఒకప్పుడు వీరి క్రేజ్ తో ఇద్దరికి పెళ్ళి , స్వయంవరం లాంటివి కూడా చేశారు మేకర్స్. చాలా రోజుల త‌ర్వాత సుధీర్, ర‌ష్మీ జంట మ‌ళ్లీ బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 14వ తేదీన ఈటీవీలో సంక్రాంతికి వస్తున్నాం పేరుతో కార్యక్రమం రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ షోలో హైపర్ ఆది పుష్ప2 స్పూఫ్ చేశాడు. అంతేకాదు.. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా 14వ తేదీన విడుదల కాబోతోంది.ఈ కార్యక్రమంలో తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాటకు సుధీర్, రష్మి డ్యాన్స్ చేశారు. వింటేజ్ లో వీరిద్దరూ ఎలా ఉండేవారే అలా చూపించారు. ఇద్దరూ పోటీపడుతూ రొమాంటిక్ సన్నివేశాలు చేశారు. వీరి స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి మ‌త్తెక్కించేలా చేస్తున్నాయి.వీళ్లిద్దరి రీ ఎంట్రీ చూసిన ఆడియన్స్.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. మా అన్నా వదినా వచ్చేశారంటూ పడగ చేసుకుంటున్నారు. సుధీర్ కు బుల్లితెరపై భారీగా పాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ పండగప్రోగ్రామ్ తో ఆపేస్తారా..? లేక ఇలానే వారి యాంకరింగ్ ప్రస్తానం అలాగే కంటీన్యూ చేస్తారా అనేది చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది