Anasuya And Rashmi Gautam : రష్మీ – అనసూయ మధ్య విభేదాలు.. ఏ విషయంలోనే తెలుసా..?
ప్రధానాంశాలు:
రష్మీ - అనసూయ విభేదాలకు ఇలా ఫుల్ స్టాప్ పడిందా..?
ఒక్క హగ్గు ఇచ్చి అనసూయ అన్నింటిని మరచిపోయేలా చేసింది
Anasuya And Rashmi Gautam : రష్మీ - అనసూయ మధ్య విభేదాలు.. ఏ విషయంలోనే తెలుసా..?
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘జబర్దస్త్’ షో ద్వారా అనసూయకి ఎనలేని గుర్తింపు వచ్చింది. ఈ షో నుండి ఆమె వెళ్ళిపోయి సినిమాల్లో రంగస్థలం, పుష్ప వంటి విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ‘జబర్దస్త్’ 12వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో అనసూయ తిరిగి మెరిసింది. ఈ కార్యక్రమంలో యాంకర్ రష్మితో తనకు ఉన్న విభేదాలపై అనసూయ బహిరంగంగా మాట్లాడి, చాలా కాలంగా సాగుతున్న పుకార్లకు ముగింపు పలికింది.

Anasuya And Rashmi Gautam : రష్మీ – అనసూయ మధ్య విభేదాలు.. ఏ విషయంలోనే తెలుసా..?
Anasuya And Rashmi Gautam : అనసూయ-రష్మి మధ్య వివాదంపై జబర్దస్త్ స్టేజ్ మీద క్లారిటీ
ఈవెంట్‌లో భాగంగా అనసూయ మాట్లాడుతూ “జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండా ఇస్తుంది, నేను కొన్ని ప్యాచ్‌అప్‌లు చేయాల్సి ఉంది” అని చెప్పి రష్మిని వేదికపై కౌగిలించుకుంది. దీనితో రష్మి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. గతంలో తమ మధ్య ఉన్న దూరం గురించి అనసూయ స్పష్టంగా మాట్లాడుతూ, “మన ప్యాచ్‌అప్‌ల వల్ల మన ఇద్దరం మాట్లాడుకోరా అని చాలామందికి తెలిసిపోయింది” అని పేర్కొంది. దీనికి రష్మి “వాట్సప్ లేదా ఫోన్ చేసి మాట్లాడుకుంటే అయిపోయేది కదా” అని అనగా “అలా అయితే ఈగోలు అడ్డొస్తాయి” అని అనసూయ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఈ సంఘటన ద్వారా గతంలో వారి మధ్య మనస్పర్థలు ఉన్నాయని అనసూయ పరోక్షంగా అంగీకరించినట్లు స్పష్టమైంది.
అనసూయ ‘జబర్దస్త్’ యాంకర్‌గా ఉన్న సమయంలో, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షో ప్రారంభమైనప్పుడు రెమ్యునరేషన్ విషయమై మల్లెమాలతో వచ్చిన విభేదాల కారణంగా అనసూయ ఆ షో నుండి తప్పుకుందని, ఆ స్థానంలో రష్మిని తీసుకున్నారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అప్పటినుండి ‘జబర్దస్త్’ వర్సెస్ ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’, అనసూయ వర్సెస్ రష్మి అనే పోటీ మొదలైంది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా వార్తలు వచ్చినా, ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు అనసూయ స్వయంగా వాటిని ధృవీకరించడంతో, అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు తెరపడింది. కెరీర్ విషయానికొస్తే అనసూయ ఇటీవలే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ వంటి షోలతో బుల్లితెరకి రీఎంట్రీ ఇచ్చారు, అయితే రష్మి ‘జబర్దస్త్’తో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోలతో యాంకరింగ్ కొనసాగిస్తున్నారు.
