Sudigali Sudheer: బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచే కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. సినిమాలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అయితే జబర్ధస్త్ ద్వారా ఎక్కువ పాపులారిటీ అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. సుధీర్ అనే పేరుతో జబర్దస్త్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తరువాత కాలంలో తన కామెడీ టైమింగ్ తో ఏకంగా ఒక టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. సుడిగాలి సుధీర్ పేరుతో తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గరయ్యాడు. చాలా కాలం నుంచి ఈటీవీ ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయిపోయిన సుడిగాలి సుధీర్ తాను చేస్తున్న మల్లెమాల షోల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
సుధీర్ మల్లెమాల సంస్థలో వచ్చే షోలతో మంచి పాపులారిటీ అందుకోగా, రాను రాను ఆ సంస్థకి సంబంధించిన ఒక్కో షో నుండి తప్పుకుంటూ వచ్చాడు. మొదట ఆయన ఢీ రియాలిటీ షో మానేశారు. అనంతరం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కూడా వదిలేశారు. సుధీర్ జబర్దస్త్ కి దూరం కావడం అందరిని ఆశ్చర్యపరచింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి కూడా బయటకు వచ్చేసిన సుధీర్ పూర్తిగా ఈటీవికి దూరం అయ్యాడు. ఇది ఆయన ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఇటీవల మాటీవీలో ఓ సింగింగ్ షోకి అనసూయతో పాటు యాంకర్ గా చేశాడు. ఆ షో ఇటీవల ముగిసింది. అయితే మల్లెమాల షోస్ ని, ఈటీవిని సుధీర్ వదిలివేయడం వెనుక యాంకర్ ఓంకార్ ఉన్నాడనే వాదన తెరపైకి వచ్చింది.
ఓంకార్ సలహా మేరకు సుధీర్ నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఓంకార్ అధిక రెమ్యూనరేషన్ ఎరగా వేసి సుధీర్ ని ట్రాప్ చేశాడు అంటున్నారు. జబర్దస్త్ లో టీమ్ లీడర్ కాకముందు నుంచే ఓంకార్ సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులను స్టార్ మాకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారట. ఒకప్పటి మేనేజర్ ఏడుకొండలు ఈ విషయాన్ని ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం సుధీర్ నిర్ణయాల వెనుక ఓంకార్ ఉన్నారంటున్నారు. ఓంకార్ వల్లనే సుధీర్ కెరీర్ డౌన్ ఫాల్ అయిందని చెబుతున్నారు. సుధీర్ హీరోగా ప్రస్తుతం గాలోడు, కాలింగ్ సహస్ర అనే చిత్రాలు తెరకెక్కుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.