
How to Cook Kaju Paneer Recipe in telugu
Kaju Paneer Recipe : ఈరోజు మన రెసిపీ ఏంటంటే కాజు పన్నీర్ కర్రీ మంచి టేస్టీగా చేయాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎలాంటి వాటిల్లోకైన ఎక్సలెంట్ గా ఉంటుంది టేస్ట్. మనం దాబాలకి రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాం కదా అదే టెస్ట్ వచ్చేటట్టు ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి.. దీనికి కావలసిన పదార్థాలు : పన్నీర్ ముక్కలు, జీడిపప్పులు, పసుపు ,కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్, ఉల్లిపాయలు, టమాటాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, ఎండు మిరపకాయలు, పెరుగు మిర్యాల పొడి, జీలకర్ర పొడి, వాటర్ , కసూరి మేతి, పచ్చిమిర్చి, బటర్ మొదలైనవి..
దీని తయారీ విధానం : ముందుగా పన్నీర్ ముక్కల్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని దాన్లో ఒక 20 జీడిపప్పులు వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ లోకి 4 అల్లం ముక్కలు కొంచెం వెల్లిపాయలు, నాలుగైదు ఎండు మిరపకాయలు, నాలుగు జీడిపప్పులు, కొంచెం పెరుగు వేసి వాటర్ వేసి పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక్కడాయి పెట్టుకుని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు పాటు వేయించి తీసి పక్కన పెంచుకోవాలి. తర్వాత అదే పాన్ లో మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఒక కప్పు ఉల్లిపాయలు, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేయించుకోవాలి.
How to Cook Kaju Paneer Recipe in telugu
తర్వాత దానిలో టమాటలను కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత దానిలో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వెండి మిరపకాయ పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకొని దానిలో కొంచెం బటన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నీళ్లను కూడా పోసి కొద్దిసేపు పాటు ఉడకనిచ్చి దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఐదు నిమిషాల వరకు ఉడికించుకొని దానిలో రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కసూరి మేతి కొంచెం గరం మసాలా వేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆపి వేరే బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.