Home » Entertainment » Sudigali Sudheer Comedy Stock Exchange Public Talk
Entertainment

Sudigali Sudheer : అయ్యో పాపం.. సుడిగాలి సుధీర్ యొక్క ఆ షోను పట్టించుకునే వారే కరువు…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 3, 2022, 11:40 am
Advertisement

Sudigali Sudheerజబర్దస్త్ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మరో సారి నిరాశ పరిచాడు. ఈటీవీ నుండి బయటకు వెళ్లిన తర్వాత స్టార్ మా లో ఒకటి రెండు షో లో కనిపించిన సుడిగాలి సుధీర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయాడు. హీరోగా వరుసగా సినిమా లు చేస్తున కారణంగా తాను జబర్దస్త్ కి డేట్లు ఇవ్వలేక పోతున్నాను అంటూ ఒక సాకు చెప్పి పక్క ఛానల్ కి వెళ్లి పోయిన సుడిగాలి సుధీర్ అక్కడ సక్సెస్ అవ్వలేదు. దాంతో మళ్లీ ఈటీవీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నించాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

Advertisement

ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఆహా ఓటీటీలో సుధీర్ కామెడీ షో మొదటి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అయింది. అనిల్ రావిపూడి కూడా ఈ కామెడీ షోలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరు తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ షో కి జనాల నుండి పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఓటీటీ కార్యక్రమం అంటేనే జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి లేదు. టీవీ కార్యక్రమాలకు ఓటీటీ కార్యక్రమాలకు కాస్త తేడా ఉంటుంది. టీవీ కార్యక్రమాలు సక్సెస్ అయితే పెద్ద ఎత్తున చూస్తారు కానీ ఓటీటీ కార్యక్రమాలకు ఇంకా తెలుగు ప్రేక్షకులు అలవాటు పడలేదు.

Sudigali Sudheer Comedy Stock Exchange public talk

Advertisement

ఒకటి రెండు కార్యక్రమాల మినహా తెలుగులో ఇప్పటి వరకు ఏ ఒక్క ఓటీటీ కార్యక్రమం కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. పైగా ఆహా యొక్క ఖాతాదారులు కొద్ది మందే ఉంటారు. దాంతో ఈ కార్యక్రమాన్ని చూసేవారు కానీ సుధీర్ యొక్క కామెడీని ఎంజాయ్ చేసేవారు కానీ ఎక్కువ మంది లేరు అంటూ టాక్‌ వినిపిస్తుంది. కొందరు సుధీర్ అభిమానులు మాత్రం ఎప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ వస్తుందా అంటే ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే నిన్న ఈ షో స్ట్రీమింగ్ అయ్యి వారికి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ముందు ముందు అయినా ఈ షో ఆహా అనిపిస్తుందేమో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి