Rashmi Gautam : యాంకర్ రష్మి వయసు మీద కౌంటర్.. దారుణంగా పరువుదీసిన సుడిగాలి సుధీర్
Rashmi Gautam యాంకర్ రష్మీ గౌతమ్ Rashmi Gautam గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. అప్పుడెప్పుడో ఉదయ్ కిరణ్ హోలీ సినిమాలో సునీల్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించింది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చినా గుర్తింపు మాత్రం రాలేదు. ఎప్పుడైతే రష్మీ జబర్దస్త్ స్టేజ్ మీదకు అడుగుపెట్టిందో అప్పటి నుంచి లైమ్ లైట్‌లోకి వచ్చింది. అలా రష్మీ ఇప్పుడు జబర్దస్త్ ద్వారా స్టార్ సెలెబ్రిటీగా మారిపోయింది. వెండితెరపైనా హీరోయిన్‌గా సినిమాలు చేసింది.
Sudigali Sudheer Counters on Rashmi Gautam Age
యాంకర్ రష్మి వయసు మీద కౌంటర్.. Rashmi Gautam
వెండితెర మీద రష్మీకి అంతగా కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన హిట్టు మాత్రం రాలేదు. ఇక తన ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే పెట్టేసింది రష్మీ. అయితే రష్మీ వయసు మీద ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు కౌంటర్లు వేస్తూనే ఉంటారు. అయితే తన వయసు గురించి రష్మీ బయటకు చెబుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో రష్మీ ఈ విషయాన్ని ఎప్పుడో ప్రకటించేసింది. రష్మీ వయసు 35 వరకు ఉంటుందని తెలుస్తోంది.
Anchor Rashmi Gautam Fun With New Relation On Sudheer
అయితే తాజాగా రష్మీ వయసు మీద సుధీర్ దారుణమైన కామెంట్ చేశాడు. వచ్చే వారం రానున్న ఢీ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో రష్మీ తన వయసు గురించి చెబుతూ.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అని అంటుంది. పదహారు ఒకట్లా? రెండ్లా? అని ప్రదీప్ కౌంటర్ వేస్తే.. పదహారు మూడ్లు కూడా వేసుకోవచ్చని సుధీర్ కౌంటర్ వేస్తాడు. దీంతో రష్మీ మొహం దెబ్బకు మాడిపోయింది. ఆ కౌంటర్‌తో అందరూ పగలబడి నవ్వేశారు.
