Janaki Kalaganaledu 13 Aug Today Episode : జ్ఞానాంబ చీర, నగలు వేసుకొని కాలేజీకి రామాతో కలిసి వెళ్లిన జానకి.. అప్పుడే జ్ఞానాంబ అక్కడికి రావడంతో అందరూ షాక్?
Janaki Kalaganaledu 13 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 13 ఆగస్టు 2021, 105 వ ఎపిసోడ్ శుక్రవారం తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. జానకికి తీసుకెళ్లాల్సిన టిఫిన్ ను తినేసి.. ఖాళీ బాక్స్ ను పంపించింది మల్లిక. ఎందుకు ఇలా చేస్తున్నావు. మొన్న చెప్పులు తెంపావు.. ఇప్పుడు ఖాళీ టిఫిన్ బాక్స్ పంపించావు.. ఎందుకిలా చేస్తున్నావు అని మల్లికను తిడుతాడు విష్ణు. దీంతో.. మనం కొత్త కాపురం పెడుదామంటే ఎందుకు వద్దంటున్నావు. మనం కొత్త కాపురం పెట్టేదాక నేను ఇలాగా చేస్తా.. అంటూ మల్లిక అంటుంది.

Janaki kalaganaledu 13 august 2021 friday 105 episode highlights
బాబు.. జానకి.. అంత తెలివి తక్కువ కాదు తను. తనకు మనకన్నా ఎక్కువ తెలివి ఉంది. మనం అత్తయ్యకు తెలియకుండా వడ్డీకి డబ్బులు ఇస్తున్న విషయాన్ని కనిపెట్టింది. తన మొగుడికి కూడా చెప్పింది అనగానే.. విష్ణు టెన్షన్ పడతాడు. ఒకవేళ అన్నయ్య అమ్మకు చెబుతాడేమో అని టెన్షన్ పడటంతో.. ఏం చెప్పడు లే.. వాళ్ల జుట్టు నా దగ్గర ఉంది కదా.. అని చెబుతుంది మల్లిక.
కట్ చేస్తే.. జానకి.. ఖార్ఖానాలో అన్ని పనులు నేర్చుకుంటోంది. దీంతో పనోళ్లు కూడా తనను మెచ్చుకుంటున్నారు. జానకిని అందరూ మెచ్చుకోవడం చూసి.. ఈర్ష్య పడుతుంది మల్లిక. ఎలాగైనా జానకి ఈ పనులు చేయకుండా ఆపాలని అనుకుంటుంది మల్లిక. దీంతో.. తను పని చేసే దగ్గరికి వెళ్లి.. తనను డిస్టర్బ్ చేస్తుంటుంది మల్లిక. అక్కడ పనోళ్లతో కూడా గొడవ పెట్టుకుంటుంది మల్లిక. తనను బోడమ్మ అన్నాడని పనోడితో గొడవకు దిగుతుంది మల్లిక. కావాలని.. రచ్చ చేస్తుంది. రచ్చ రంబోలా చేస్తుంది. ఖార్ఖానాలో మొత్తం గొడవ చేస్తుంది. తెగ ఆవేశపడుతుంది. దీంతో.. లాభం లేదని.. మల్లికను ఖార్ఖానా నుంచి బయటికి తీసుకెళ్తుంది జానకి. చిన్న చిన్న విషయాలకు ఎందుకు కోపం మల్లిక.. అనగానే.. నీ మీద కూడా నాకు కోపం ఉంది జానకి. కోడలు అంటే ఇంకా పాత కాలం కోడలులాగానే ప్రవర్తిస్తున్నావు. కోడలు అంటే కన్నీళ్లు కాదు.. కొడవలి.. అని చెప్పాలి. ఆ పోలేరమ్మకు చుక్కలు చూపించాలి.. అని చెబితే.. మల్లిక ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. వద్దు మల్లికా.. అలా ప్రవర్తించకు. అత్తయ్య మనల్ని కోడళ్లుగా కాదు.. కూతుళ్లుగా చూసుకుంటున్నారు.. అని అంటుంది. అలాగే.. నాకు బోంది లడ్డులు ఎలా చేయాలో నేర్పించు అని అడుగుతుంది జానకి. దీంతో.. ఇప్పుడు కాదు.. రేపు నేర్పిస్తానులే అని చెప్పి.. అక్కడి నుంచి తప్పించుకుంటుంది మల్లిక.

Janaki kalaganaledu 13 august 2021 friday 105 episode highlights
అన్నవరం గుడికి కొన్ని స్వీట్ల డబ్బాలను ఉచితంగా అందిస్తుంది జ్ఞానాంబ. అక్కడ ఇచ్చి రావడానికి స్వీట్లు కారులో సర్ది.. జ్ఞానాంబ కారులో అన్నవరం వెళ్తుంది. తన భర్తకు అన్ని విషయాలు చెప్పి తను వెళ్తుంది. ఇక.. ఇంట్లో సందడి మొదలు అవుతుంది. చికిత కూడా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ వంట చేస్తుంటుంది. సూపర్బ్ గా డ్యాన్స్ చేస్తుంది. రామా కూడా ఫుల్ గా హ్యాపీ ఇంటికి వస్తాడు. జానకి గురించి ఆలోచిస్తూ.. మైకంలో ఉంటాడు.
దీంతో చికిత చూసి.. ఏంటి.. అంత ఉల్లాసంగా ఉన్నారు అని రామాను అడుగుతుంది. దీంతో ఎవ్వరికీ చెప్పకు. పెట్రోల్ రేటు 5 పైసలు తగ్గింది. ఎవ్వరికీ చెప్పకు అని షాక్ ఇస్తాడు రామా. అమ్మానాన్నా ఎక్కడున్నారు అని అడుగుతాడు. దీంతో అది చాలు.. అంటూ చికిత.. ఇంత మంచి తీపి వార్త చెప్పినందుకు నీ నోరు తీపి చేయాలి కదా.. ఒక వారం తర్వాత గుర్తు చేయి ఇస్తాను.. అని చెప్పి జంప్ అయిపోతాడు రామా.
Janaki Kalaganaledu 13 Aug Today Episode : జ్ఞానాంబ నగలు, చీరను కట్టుకొని బుట్టబొమ్మలా తయారైన జానకి
వెంటనే గదిలోకి వెళ్లి.. ఒక చీరను తీసుకొని కొన్ని నగలను తీసుకొని ఒక సంచిలో పెట్టి రజినీని పిలుస్తాడు. గురూజీ.. ఈ శిష్యుడిని పిలవడానికి కారణం ఏంటి? అని అడుగుతాడు. నేనే చేయను అన్నా.. సారీ అని అంటాడు. నువ్వు శాసించాలి.. నేను పాటించాలి.. అంతే అన్నా.. అనగానే.. ముందు ఈ చీర తీసుకెళ్లి మీ వదినకు ఇవ్వు. ఈ చీరను కట్టుకొమ్మని చెప్పు. 5 గంటలకు వచ్చి కలుస్తానని చెప్పు.. అని చెబుతాడు రామా.
వెంటనే రజినీ.. ఖార్ఖానాకు వెళ్తాడు. ఏమైంది చిట్టి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది జానకి. రామా అన్నయ్య.. మీకు ఇది రహస్యంగా ఇవ్వమన్నాడు.. అని అంటాడు. అన్నయ్య మీకు ఇది ఇవ్వమన్నాడు.. అని సంచిని ఇస్తాడు. చీర చూసి.. నాకోసం ఎందుకు పంపించాడు.. అని అడగగానే.. సాయంత్రం 5 గంటల కల్లా ఈ చీర కట్టుకొని రెడీగా ఉండమన్నాడు అన్న.. అని చెబుతాడు రజినీ. ఇది అత్తయ్య గారి చీరలా ఉందే అని అనుకుంటుంది జానకి. ఈ నగలు కూడా నావి కాదు. నన్ను ఎందుకు కట్టుకోమ్మని నాకు పంపించాడు.. అని ఆలోచిస్తుంది జానకి.

Janaki kalaganaledu 13 august 2021 friday 105 episode highlights
కట్ చేస్తే సాయంత్రం 5 కాగానే.. ఖార్ఖానాకు వెళ్తాడు రామా. జానకి ఇంతకీ ఆ చీర కట్టుకుంటుందా? లేదా? అని టెన్షన్ పడతాడు. వెళ్లి డోర్ కొట్టగానే.. జానకి రామా పంపించిన చీర కట్టుకుంటుంది. నగలు పెట్టుకుంటుంది. అంతే.. జానకిని అలా చూసి షాక్ అయిపోతాడు. పడిపోతాడు రామా. ఏమండి.. రామచంద్రగారు. ఏమైంది.. పిలిచిలా పలకడం లేదు. ఇంతలా ఆలోచిస్తున్నారు ఏంటండి.. అంటుంది. ఏదైనా అద్భుతం చూస్తే మన పంచేంద్రియాలు అన్నీ పనిచేయడం ఆగిపోతాయట. అచ్చం మా అమ్మలా ఉన్నారు. మీకు తెలియని కళ వచ్చింది.. అని తనను పొడుగుతాడు రామా.

Janaki kalaganaledu 13 august 2021 friday 105 episode highlights
మీది లక్ష్మీదేవి కళ. మా అమ్మ బట్టలు, నగల్లో ఆ కళ ఇంకా పెరిగిపోయింది. అత్తయ్య గారి బట్టలను నన్ను కట్టుకొమ్మని ఎందుకు పంపించారు.. అని అడుగుతుంది. మనం ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లినప్పుడు మంచి జరగాలని పెద్ద వాళ్ల ఆశీస్సులు తీసుకుంటాం. ఒకవేళ వాళ్లు మన దగ్గర లేకపోతే.. వాళ్ల బట్టలు వేసుకుంటే వాళ్ల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఈ పని చేశా. పదండి.. వెళ్దాం అంటాడు రామా. దీంతో వద్దండి.. అత్తయ్య తిడుతుంది అంటే.. ఏంకాదు.. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిన చోటు అది అంటాడు రామా. పదండి.. అని తీసుకెళ్తాడు రామా. కాలేజీ గ్రాడ్యుయేషన్ సెరమనీకి జానకిని తీసుకెళ్తాడు రామా. అక్కడికి జ్ఞానాంబ కూడా వస్తుంది. మరి.. జానకిని తన చీర, నగల్లో.. జ్ఞానాంబ చూస్తుందా? చూసి షాక్ అవుతుందా? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.