Kajal agarwal : మొన్న సమంత, ఇప్పుడు కాజల్ అగర్వాల్.. వీరికేం పనిలేదా..?

Advertisement

Kajal agarwal : ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ మీద చాలా రకాల వార్తలు వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ ఏం చేసినా అది ఓ సెన్షేషన్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే కొందరు పనికట్టుకొని మరీ సెన్షేషన్ అయ్యేలా న్యూస్ ని క్రియేట్ చేస్తున్నారు. కొన్ని మనసుకు బాధ కలిగించినా ఇలాంటి వార్తలకి ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు మన స్టార్ హీరోయిన్స్. ఇలా ఉండటం కూడా ఒకరకంగా నెటిజన్స్‌కి, న్యూస్ క్రియేట్ చేసే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే అవుతోంది. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటూ అప్పుడప్పుడూ ఏదో వెకేషన్స్‌కి ఫారిన్ ట్రిప్స్ వేసి ఆ పిక్స్ షేర్ చేస్తే చాలు పదులకొద్దీ వార్తలు పుట్టించేస్తున్నారు.

netizens created fake news on samantha, kajal agarwal
netizens created fake news on samantha, kajal agarwal

ఒక వార్త వచ్చి అది నిజమా కాదా అని క్లారిటీ వచ్చే లోపే వందలకొద్దీ ఉన్న సోషల్ మీడియా వెబ్ సైట్స్‌లో న్యూస్ వైరల్ చేసేస్తున్నారు. దానికి తోడు రేటింగ్ కోసం కొన్ని మీడియా ఛానల్స్ కూడా తయారై ఈ ఫేక్ న్యూస్‌ని రోజంతా తిప్పి తిప్పి చిరాకు తెప్పిస్తుంటారు. మొన్నా మధ్య అక్కినేని కోడలు సమంత ఏదో రిలాక్స్డ్‌గా ఉన్న కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇందులో భర్త చైతూ కూడా ఉన్నాడు. ఈ పిక్స్ చూసిన కొంతమంది ఇక సమంత సినిమాలు మానేస్తుందంటూ వార్తలు పుట్టించారు. అందుకు కారణం కూడా వారే క్రియేట్ చేశారు. సమంత గర్భవతి అని, అందుకే ఇక సినిమాలకి దూరంగా ఉండాలనుకుంటున్నారని, చైతూ కోరిక మేరకే సమంత ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు పుట్టించారు.తీరా చూస్తే అది ఫేక్ న్యూస్. కేవలం గాసిప్ రాయుళ్లు క్రియేట్ చేసిన గాలి వార్త.

Advertisement

Kajal agarwal : భర్త గౌతం కిచ్లు ఎప్పుడు సినిమాలు ఒద్దంటే అప్పుడు మానేస్తా

ఇప్పుడు కూడా సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో సినిమాలు మానేయడానికి రెడీ అవుతుందని..భర్త ఎప్పుడు చెప్తే అప్పుడు సినిమాలకి టాటా చెప్పేస్తానని చెప్పినట్టు వార్తలు వస్తూ, వైరల్ అవుతున్నాయి. అయితే కాజల్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌లో ఒక్క పాయింట్ మాత్రమే కరెక్ట్. చిట్ చాట్‌లో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ..తన భర్త గౌతం కిచ్లు ఎప్పుడు సినిమాలు ఒద్దంటే అప్పుడు మానేస్తానని సమాధానిచ్చింది. దీనికి కాజల్ గర్భవతి అయింది. అందుకే సినిమాలు మానేయనుంది అని రాసేస్తున్నారు.

ఇటీవల వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఓ ఫెస్టివల్‌కి బంధువులతో కలిసి గడిపిన కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది తన శ్రీమంతం కి సంబంధించిన ఫొటోలంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ మొన్నా మధ్య సమంత మాదిరిగానే కాజల్ మీద ఇప్పుడు పుట్టిన పుకారు మాత్రమే. ప్రస్తుతం తమిళంలో లోక నాయకుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య, కింగ్ నాగార్జున సరసన ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ చాలా బిజీగా ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి ==>  జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్‌ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> దుమ్ములేపుతోన్న కార్తీక దీపం హిమ.. వంటలక్క కూతురు రచ్చ!!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏసేయండి ఏసేయండి అంటే నన్నే ఏసేశారు!!.. డాక్టర్ బాబు పరిస్థితి ఘోరం

Advertisement
Advertisement