Sudigali Sudheer : అడుక్కుంటున్నా.. దయచేసి అలా చేయండి : సుడిగాలి సుధీర్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 28, 2021, 6:00 pm

Sudigali Sudheer సుడిగాలి సుధీర్ Sudigali Sudheer తెర మీద ఎలాంటి వేషాలు వేసినా, నవ్వించేందుకు ఎలాంటి పాట్లు పడ్డా కూడా తెర వెనుక మాత్రం ఎంతో ఎమోషనల్ వ్యక్తి. బంధాలు, బంధుత్వాలు, ప్రేమకు ఎంతో విలువిస్తాడు. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడు. అమ్మానాన్నలు అంటే ఎంతో ప్రేమిస్తాడు. అలాంటి సుధీర్ తాజాగా కన్నీరు పెట్టేసుకున్నాడు. వచ్చే ఆదివారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో అందరినీ కదిలించేలా ఉన్నారు. వృద్దాశ్రమంలోని కొందరు వృద్దులను తీసుకొచ్చారు.

Sudigali Sudheer Emotional On Oldage Home

Sudigali Sudheer Emotional On Oldage Home

వారి కన్నీటి గాథలను వివరించారు. ఓ కొడుకు తన తల్లిని ఓల్డేజ్ హోం వద్ద ఎలా వదిలి వెళ్లిపోయాడు.. ఆ తల్లి ఎలా ఏడుస్తూ కూర్చుండిపోయిందో చెబుతూ కన్నీరు పెట్టేసుకున్నాడు. అలా ఎంతో మంది గాథలను ఎపిసోడ్‌లో చూపించబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే తల్లి దండ్రులను అలా వదిలేయకండి అంటూ షోలో చెప్పిన సుధీర్.. బయట కూడా ఎమోషనల్ అయ్యాడు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఇదే విషయాన్ని చెబుతూ ప్రాధేయపడ్డాడు.

 

Sudigali Sudheer Emotional On Oldage Home

Sudigali Sudheer Emotional On Oldage Home

ప్రాధేయపడుతూ వేడుకున్న సుధీర్ Sudigali Sudheer

ప్రతీ ఒక్కరినీ వేడుకుంటున్నా.. తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలలో వదిలేయకండి. వారిని సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన విధి కాదు.. మన బాధ్యత. మనం సంతోషంగా ఉండేందుకు వారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం చేయగలిగింది అంతే. మన ప్రేమను అలా చూపించాలి. ఎవరైతే తమ తల్లిదండ్రులను అలా ఓల్డేజ్ హెంలో వదిలేశారో.. వారిని తిరిగి తీసుకురండి.. వారిని సంతోషంగా చూసుకోంది.. దయచేసి తీసుకురండి.. మిమ్మల్ని అడుక్కుంటున్నాను. వారు లేకపోతే ఇళ్లు అసంపూర్ణంగా ఉంటుంది అని సుధీర్ ఎమోషనల్ అయ్యాడు.

Sudigali Sudheer Emotional On Oldage Home

Sudigali Sudheer Emotional On Oldage Home

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp