Sudigali Sudheer : సరి దిద్దుకోలేని తప్పు చేసిన సుడిగాలి సుధీర్‌.. కెరీర్‌ మొత్తం నాశనం..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :26 January 2023,10:20 am

Sudigali Sudheer : అవును… సుడిగాలి సుదీర్ జీవితంలోనే సరి దిద్దుకోలేనంత పెద్ద తప్పును చేశాడు. ఆ పెద్ద తప్పు మరి ఏదో కాదు.. ఈటీవీ, మల్లెమాలను వదిలి బయటకు వెళ్లి పోవడమే. హైపర్ ఆది మాదిరిగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కొనసాగుతూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేయడం లేదా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ శ్రీదేవి డ్రామా కంపెనీని వదిలేయడం లాంటివి చేస్తే బాగుండేది. కానీ సుధీర్ మొత్తానికి మల్లెమాల మరియు ఈటీవీ కార్యక్రమాలను వదిలేసి పక్క ఛానల్ వెళ్లి పోయాడు. అక్కడి వారు రేటింగ్ రావడం లేదు అంటూ చేతులెత్తేయడంతో ఏం చేయాలో పాలు పోక సుడిగాలి సుధీర్ దిక్కులు చూస్తున్నాడు. హీరోగా వరుసగా అవకాశాలు వస్తున్నాయంటూ

చెప్పిన సుధీర్ ఎంత వరకు ఆ అవకాశాలు దక్కించుకుంటున్నాడు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆయన కెరియర్ లో జబర్దస్త్ లో చేస్తున్న సమయంలో ఉన్నంత స్పీడ్ ఇప్పుడు లేదనే చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమం చేస్తున్నప్పుడే ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఆయనకు ఆ సినిమా ఆఫర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. బుల్లి తెర సూపర్‌ స్టార్ అంటూ సుడిగాలి సుదీర్ ని అభిమానులు నెత్తిన పెట్టుకొని పూజించారు. కానీ ఆయన మాత్రం తనకు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమని చెప్పి వెళ్ళి పోయాడు. అక్కడ చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కనుక సుడిగాలి సుదీర్ ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.

Sudigali Sudheer fans praying to god for Jabardasth Re Entry

Sudigali Sudheer fans praying to god for Jabardasth Re Entry

సుధీర్ టీవీ రంగంలోనే ఉండి ఉంటే కచ్చితంగా ఆయనకు అంతకు మించిన గుర్తింపు లభించేది అనడంలో సందేహం లేదు. తాను చేసిన పొరపాటు ఇప్పుడు కెరీర్ నే నాశనం చేయబోతుంది అని అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ని దేవుడు అంటూ పూజించిన వారు ఇప్పుడు ఆయన చేసిన తప్పుకు దండిస్తున్నారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అంటూ సుధీర్ బాధపడే విధంగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి సుధీర్‌ ని మల్లెమాల వారు జబర్దస్త్ లో మళ్లీ ప్రవేశించే అవకాశం ఇస్తే బావుండు అని ఆయన అభిమానులు దేవుని ప్రార్థిస్తున్నారు. కానీ అలా జరుగుతుందా అంటే అనుమానమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి