Sudigali Sudheer : అదైనా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కామెడీ ఆకలి తీరుస్తుందా.. ఆహా అనిపించినా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 1, 2022, 2:20 pm

Sudigali Sudheer : బుల్లి తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంత సినిమా తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆయన అభిమానులు మాత్రం బుల్లి తెరపై చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన కామెడీ స్కిట్స్ ని షేర్ చేసుకుంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అసలు కూడా సుధీర్ కనిపించడం లేదు. దాంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ కనిపించబోతున్నాడు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమంతో రేపటి నుండి ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సుడిగాలి సుదీర్ మరో సారి తన అభిమానులకు వినోదాన్ని పంచబోతున్నాడు. ఇన్నాళ్లు టీవీ తెరపై మరియు వెండి తెరపై సందడి చేసిన సుధీర్ మొదటి సారి ఓటీటీ ప్లాట్ఫామ్ పై కామెడీ కార్యక్రమం చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల అయ్యి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

Sudigali Sudheer fans wating for new aha ott comedy show

Sudigali Sudheer fans wating for new aha ott comedy show

తప్పకుండా సుడిగాలి సుదీర్ ప్రేక్షకులను ఆ కార్యక్రమంతో ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ జరుగుతుంది. సుధీర్ అభిమానుల కామెడీ ఆకలి కచ్చితంగా కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్ కార్యక్రమం తీర్చుతోందని నిర్వాహకులు చెప్తున్నారు. స్కిట్ చేయడంతో పాటు యాంకర్ గా కూడా సుధీర్ సందడి చేస్తాడు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి కీలకంగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే తేలిపోయింది. దీపిక పిలి యాంకర్ గా వ్యవహరించబోతుంది. జబర్దస్త్‌ మరియు పటాస్ కు చెందిన పలువురు కమెడియన్స్ ఈ షో లో కనిపించబోతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp