Sudigali Sudheer : ‘ఆడికి ఫుల్ బలిసింది తోలు తీసేస్తా’ రాకెట్ రాఘవ గురించి సుడిగాలి సుధీర్ ఇలా ఎందుకు అన్నాడు !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 5 February 2023, 12:00 pm

Sudigali Sudheer : ఒకప్పుడు జబర్దస్త్ బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో గా ఉండేది. అత్యధిక టిఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్లిపోయిన జబర్దస్త్ ప్రస్తుతం అంతగా జనాలను ఆకట్టుకోలేక పోతుంది. గతంలో టాప్ కమెడియన్లు డిఫరెంట్ స్కిట్లతో జనాలను అలరించేవారు. ప్రస్తుతం ఉన్న జబర్దస్త్ లో డబల్ మీనింగ్ డైలాగులు, చెత్త పంచ్ లే కనిపిస్తున్నాయి. దీంతో మల్లెమాల షో అయిన జబర్దస్త్ టిఆర్పి రేటింగ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. జనాలకు కూడా వీళ్ళ కామెడీ అంతగా నచ్చడం లేదు. అయితే 9వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Sudigali Sudheer fire on Rocket Raghava

Sudigali Sudheer fire on Rocket Raghava

అయితే ఓ స్కిట్లో ఓ కమెడియన్ వచ్చి రాకెట్ రాఘవను మంచితనం ఇన్నాళ్లు కామెంట్ లోనే చూశాను. ఇప్పుడు నిజంగా కళ్ళారా చూస్తున్నాను కామెంట్లు నువ్వు రాయించుకునే వాడివా” అని అడుగుతాడు. దానికి రాఘవ రాయించుకున్నోళ్లు వాయించుకొని ఎప్పుడో బయటికి వెళ్లిపోయారు అని అంటాడు. దీంతో జడ్జ్ లు పగలబడి నవ్వుతారు. దీని అర్థం ఏంటో తెలియని యాంకర్ సౌమ్య కూడా నవ్వేస్తుంది. రాఘవ ఎప్పుడు ఎవరిని ఏమీ అనడు, ఎవరి జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటాడని అనుకున్నారు కానీ వెళ్లిపోయిన తోటి ఆర్టిస్ట్ మీద ఇలా పిచ్చి కామెంట్ చేయడం సరి కాదని అంటున్నారు.

Sudigali Sudheer fire on Rocket Raghava

Sudigali Sudheer fire on Rocket Raghava

నిజానికి కామెంట్లలో సూపర్, తోపు అని సుదీర్ పేరిట కనిపిస్తూ ఉంటాయి. దానిమీద కూడా రకరకాల స్కిట్లు వేసేవారు. కానీ సుదీర్ తన సహజ తత్వంతో ఎప్పటిలాగే లైట్ తీసుకొని నవ్వేసుకుంటాడు. మొత్తానికి రాఘవ చేసింది చెత్త కామెంట్ ని అని జనాలు అంటున్నారు. ఎప్పుడో వెళ్లిపోయిన సుడిగాలి సుదీర్ మీద ఇప్పుడు ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు అని సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాఘవ చేసిన కామెంట్ కి సుడిగాలి సుధీర్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి