Kushboo – Indraja : జబర్దస్త్.. ఇంద్రజ, ఖుష్బూ ల్లో ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకుంటారో తెలుసా?
Kushboo – Indraja : జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయిన సమయంలో నాగబాబు మరియు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు. మొదట వారి రెమ్యూనరేషన్ నామమాత్రంగానే ఉన్నా ఆ తర్వాత షో కి రేటింగ్ భారీగా పెరగడంతో వారి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారు. సుదీర్ఘ కాలం పాటు నాగబాబు మరియు రోజా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జ్ లుగా వ్యవహరించారు. నాగబాబు విభేదాల కారణంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వేయగా, రోజా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైంది.
ఆ తర్వాత మనో, ఇంద్రజ, కుష్బూ, కృష్ణ భగవాన్, పోసాని ఇలా పలువురు జడ్జ్ స్థానంలో కూర్చుని జబర్దస్త్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈమధ్య రెగ్యులర్ గా కుష్బూ మరియు ఇంద్రజ జబర్దస్త్ యొక్క జడ్జ్ సీటులో కూర్చుంటున్నారు. ఇద్దరు కూడా సీనియర్ హీరోయిన్స్.. ఇద్దరు కూడా ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారే. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ జబర్దస్త్ షో కి తీసుకుంటున్నారు అనేది బుల్లి తెర వర్గాల్లో చర్చ కి తెర లేపింది. కుష్బూ కంటే ముందు మల్లెమాల వారితో ఇంద్రజ ఒప్పందంలో ఉంది. కనుక ఆమెకు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కుతూ ఉంటుంది.
కుష్బూ రెగ్యులర్ గా కాకుండా తనకు వీలున్నప్పుడు వచ్చి పోతుంది. కనుక ఆమె రెమ్యూనరేషన్ కాస్త తక్కువగానే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కూడా సమఉజ్జీలే.. ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. కానీ మల్లెమాల వారితో అగ్రిమెంట్ ఉన్న వారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇంద్రజ కి వీరిద్దరిలో ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కుతుందని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ముందు ముందు కుష్బూ కూడా మల్లెమాల వారితో ఒప్పందంకి ఓకే చెప్తే ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి.