Sudigali Sudheer : హేమతో సరసాలాడిన సుధీర్.. నటి పరువుపాయే.. వైర‌ల్ వీడియో!

Authored By aruna | The Telugu News | Published on: August 24, 2021, 12:42 pm

Sudigali Sudheer : ఫైర్ బ్రాండ్ నటి హేమ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎలా మాట్లాడుతుంది.. ఆమె మాట్లాడితే కాంట్రవర్సీలు ఎలా మొదలవుతాయో అందరికీ తెలిసిందే. ఇక బిగ్ బాస్ షోలో హేమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆమె అతికి అందరూ చిరాకు పడ్డారు.

Sudigali Sudheer Fun With Actress Hema

Sudigali Sudheer Fun With Actress Hema

అందుకే మొదటి వారంలోనే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు ప్రేక్షకులు. హేమ తత్త్వానికి బిగ్ బాస్ షో కరెక్ట్ కాదని ఇండస్ట్రీలో ఎంతో మంది కామెంట్ చేశారు. చివరకు తాను కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంది. అలాంటి హేమ ఏదైనా షోకు వస్తే ఇంకెలా చేస్తుందో అందరూ ఊహించవచ్చు. వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో హేమ అతిథిగా రాబోతోంది. ఈమేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

Sudigali Sudheer Fun With Actress Hema

Sudigali Sudheer Fun With Actress Hema

హేమతో సరసాలాడిన సుధీర్.. నటి పరువుపాయే! Sudigali Sudheer

ఈ సారి హేమ పర్ఫామెన్స్ ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంది. ఇక సుధీర్, హేమ మధ్య వచ్చిన సంభాషణలు బాగానే ఉండేట్టు కనిపిస్తున్నాయి. లేడీస్ స్పెషల్ అంటూ కిట్టీ పార్టీ అనే కాన్సెప్ట్‌తో ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ రాబోతోంది. సుధీర్ తన లేడీ గ్యాంగ్‌ను తీసుకురావడంపై హేమ కౌంటర్ వేసింది. వీళ్లని ఎందుకు తీసుకొచ్చావ్ అని సుధీర్‌ను హేమ అడిగింది. కిట్టీ పార్టీ కదా? అని తీసుకొచ్చాను అని సుధీర్ అంటాడు.

 

Sudigali Sudheer Fun With Actress Hema

Sudigali Sudheer Fun With Actress Hema

ఇంతకీ మీ ఆయన ఎక్కడా? అని హేమను సుధీర్ అడుగుతాడు. నీలానే పక్క చూపులు చూస్తున్నాడని.. పక్కకు తీసుకెళ్లి.. గుద్దా అని కౌంటర్ వేస్తుంది. దీంతో సుధీర్ దెబ్బకు షాక్ అయ్యాడు. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? అని సుధీర్‌ను హేమ అడిగింది. మీరు ఖాళీగా ఉన్నారని అర్థమైంది అంటూ హేమతోనే సుధీర్ సరసాలు ఆడేశాడు.

 

 

 

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp