Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ సినిమాల బడ్జెట్‌.. పారితోషికం ఎంత!

Authored By aruna | The Telugu News | Published on: July 30, 2022, 6:00 pm

Sudigali Sudheer : చిన్న చిన్న ఈవెంట్లలో మ్యాజిక్ లు చేసుకునే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు సుధీర్ అలియాస్ సుడిగాలి సుదీర్. జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడం ఆయన యొక్క కెరీర్కి టర్నింగ్ పాయింట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ తో ఏకంగా చిన్న హీరోలను మించిన గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.

అందులో ప్రతి ఒక్క సినిమా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉందంటూ ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక జబర్దస్త్ సుడిగాలి సుధీర్ చేస్తున్న ఒక్కొక్క సినిమా బడ్జెట్ విషయానికి వస్తే కథానుసారంగా రెండున్నర కోట్ల నుండి ఐదు కోట్ల వరకు బడ్జెట్ నిర్మాతలు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అందులో సుధీర్ పారితోషకం రూ.60 నుండి రూ.75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. సుడిగాలి సుధీర్ కి ఉన్న ఇమేజ్ నేపథ్యంలో థియేటర్ల ద్వారా మాత్రమే కాకుండా ఓటీటీ కూడా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

Sudigali Sudheer movies budget and remunerations

Sudigali Sudheer movies budget and remunerations

అందుకే మినిమం గా మూడు కోట్ల వరకు బడ్జెట్ పెట్టినా కూడా సుడిగాలి సుదీర్ వెనక్కు తీసుకు రాగలరు అని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ముందు ముందు సుడిగాలి సుదీర్ సినిమా ల యొక్క బడ్జెట్‌ 5 నుండి 10 కోట్లకు పెరిగిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలో ఒకటి లేదా రెండు హిట్ అయితే ఆయన యొక్క మార్కెట్ పరిధి పెరుగుతుంది. తద్వారా ఆయన సినిమాల బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp