Sudigali Sudheer : అఫీషియల్.. ‘ఢీ’ నుంచి సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ ఔట్..

Authored By mallesh | The Telugu News | Published on: December 12, 2021, 6:20 pm

Sudigali Sudheer : బుల్లితెరపై డ్యాన్సులకు కేరాఫ్ డ్యాన్స్ షో ‘ఢీ’. ఈ షోలో పాల్గొన్న చాలా మందికి ఆ తర్వాత కాలంలో మంచి అవకాశాలొచ్చాయి. ఇకపోతే ఢీ డ్యాన్సుల సంగతి అలా ఉంచితే.. ఈ షోలో ఎప్పుడూ కనబడే సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్.. పంచులు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తాయి. కాగా, వీరిరువురు ఇకపై ఈ షోలో కనపించడం లేదని తాజగా విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తోంది.‘ఢీ’14 ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సుడిగాలి సుధీర్, రష్మి కనిపించలేదు.

ఇటీవల కాలంలో సుడిగాలి సుధీర్‌కు వెండితెరపైన పాత్రలు పోషించే అవకాశాలు చాలా వస్తున్న నేపథ్యంలో అతను ఇక బుల్లితెరపైన కొంత కాలం పాటు కనిపించరని వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సుధీర్ ‘ఢీ’లో కనబడకుండా వెళ్లారు. కాగా, సుధీర్-రష్మి గౌతమ్ లవ్ ట్రాక్, కెమిస్ట్రీని మిస్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి ప్లేసెస్ భర్తీ చేయడానికి హైపర్ ఆది, అఖిల్‌ను పెట్టినట్లు ప్రోమో‌ను చూస్తుంటే అర్థమవుతోంది.ఇక ఢీ జడ్జిలుగా ప్రియమణి, గణేశ్ మాస్టర్ ఉండగా, యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు ఉన్నారు.ఢీ షోకు సంబంధించిన చాలా సీజన్స్‌లో టీఆర్పీ రేటింగ్ బాగా పెంచడంలో సుధీర్, రష్మి కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు.

sudigali sudheer out from dhee show

sudigali sudheer out from dhee show

Sudigali Sudheer : సుధీర్, రష్మి స్థానంలో ఎవరొచ్చారంటే..

రష్మి తన అందాలను ఆరబోయడంతో పాటు సుధీర్‌తో లవ్ ట్రాక్ నడపడం, పంచులు వేస్తుండటం ఇకపైన ఉండవని తెలుసుకుని బుల్లితెర ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సుధీర్-రష్మిలు లేని ‘ఢీ’ డ్యాన్స్ షో ఎలా ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. సుధీర్‌కు సినిమా అవకాశాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ, రష్మిని ఎందుకు ‘ఢీ’ షో నుంచి తీసేశారో తెలియడం లేదు. సుధీర్ స్థానంలో ‘బిగ్ బాస్’ సీజన్ 4 రన్నరప్ అఖిల్ సార్థక్‌ను తీసుకొచ్చారు.హైపర్ ఆది, అఖిల్ సార్థక్ మధ్య ఏదో ఒక ట్రాక్ పెట్టి నవ్వులు పూయించేలా ‘ఢీ’ నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp