Home » Entertainment » Sudigali Sudheer Out From Jabardasth
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ జ‌బ‌ర్ధ‌స్త్‌ని వీడాడా… అవినాష్ కామెంట్స్‌తో క్లారిటీ!

Authored By
Sam C
The Telugu News | Updated on: June 3, 2022 8:29 pm
Advertisement

Sudigali Sudheer : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్. ఈ కార్య‌క్ర‌మంతో చాలా మంది న‌టులు సెల‌బ్రిటీ స్టేట‌స్ అందుకున్నారు.ఒకవైపు క్రేజ్ మాత్రమే కాకుండా మరొకవైపు ఆదాయపరంగా కూడా జబర్దస్త్ కొంతమంది కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది. ఆ కామెడీ షో నుంచి ఇది వరకే చాలామంది బయటకు వెళ్ళిపోగా త్వరలోనే మరికొందరు సీనియర్ కమెడియన్స్ కూడా వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ముక్కు అవినాష్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల పై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ జ‌బ‌ర్ధ‌స్త్ వీడ‌నున్న విష‌యంపై త‌న స్పంద‌న తెలియ‌జేశాడు.

Advertisement

2013 నుంచి 2019 వరకు కూడా నెంబర్ వన్ కామెడీ షోగా గుర్తింపును సొంతం చేసుకుంది జ‌బ‌ర్ధ‌స్త్‌. అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా చాలా దగ్గర అయిపోయినా జబర్దస్త్ కామెడీ షోను ఆ తర్వాత రెండు షోలు గా విభజించారు. మరొక ఎక్స్ ట్రా జబర్దస్త్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దాంట్లో కూడా కొంత మంది కమెడియన్స్ స్కిట్స్ బాగా క్లిక్ అవడంతో చాలా తొందరగానే టాప్ రేటింగ్ లభించింది. ఏడేళ్ళ వరకు కూడా తిరుగు లేదు అనే విధంగా రేటింగ్స్ అయితే వచ్చాయి. రాను రాను రేటింగ్స్ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. జబర్దస్త్ లో ఎప్పటి నుంచి కొనసాగుతున్న కమెడియన్స్ కూడా మెల్ల మెల్లగా బయటకు వెళ్లిపోతున్నారు.

sudigali sudheer out from jabardasth

Advertisement

Sudigali Sudheer : సుధీర్ వెళ్లిపోతున్నాడా..!

నాగబాబు వెళ్లిపోయిన తర్వాత చమ్మక్ చంద్ర అలాగే ముక్కు అవినాష్ ఇలా కొంతమంది ప్రముఖ కమెడియన్స్ అందరూ కూడా ఆ షో నుంచి బయటకు వచ్చేశారు. సుధీర్ కూడా వెళ్లిపోతున్నాడ‌ని వార్త‌లు రాగా, దానిపై అవినాష్ క్లారిటీ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ టీమ్ లో తనకు ఎక్కువగా క్లోజ్ గా ఉండేది మాత్రం గెటప్ శ్రీను అంటూ అతను కేవలం సినిమాల కారణంగానే ఆ మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చాడు అని తెలియజేశాడు. నిజంగానే సుడిగాలి సుదీర్ టీం జబర్దస్త్ లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనే విషయంలో కూడా ముక్కు అవినాష్ వెళ్లి పోవడం లేదు అనే అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది అని నాకు కూడా ఈ విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు అని అన్నాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి