sudigali sudheer rashmi gautham un happy
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. ఈ రెండు పేర్లు గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈ జోడి ఎక్కడ ఉన్న అక్కడ వారు చేసే సందడి మాములుగా ఉండదు. జబర్ధస్త్ , డాన్స్ షో ఢీ ల్లో వీరిద్దరూ కలిసి ఆడియెన్స్‌ను అలరిస్తుంటారనే సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు ప్రోగ్రామ్స్‌లో డాన్స్ షో ఢీ నుంచి సుధీర్, రష్మీ గౌతమ్ బయటకు వచ్చేశారు. సుధీర్ స్థానంలో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అఖిల్‌ను ఓ టీమ్ లీడర్‌గా తీసుకున్నారు. ఇక ఫిబ్రవరి 14న జరగనున్న మల్లెమాల కొన్ని షోస్ ప్లాన్ చేయగా, అందులో సుధీర్ రష్మీ లేరనే వార్తలు వస్తున్నాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుధీర్, రష్మీలకి పెళ్లిళ్లు చేసి టీఆర్‌పీ లు పొందిన మల్లెమాల ఇప్పుడు వారిని దూరంగా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు ఈ ఇద్దరి వెనక పడ్డ మల్లెమాల ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదట. సుధీర్ స్నేహితుడు రామ్ ప్రసాద్ కూడా దీనిపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సుధీర్- రష్మీ జోడిని ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇక బుల్లితెరపై తమ కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గత ఐదు సీజన్స్ నుంచి ఢీ షోలో టీమ్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. వారికున్న ఫాలోయింగ్‌ను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారా? లేక పంపించేశారా? అనేది తెలియడం లేదు.
sudigali sudheer rashmi gautham un happy
ఇక యాంకర్ రష్మీ ఇటీవల సుధీర్‌ని కాదని వేరే వ్యక్తిని సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని చాలా ప్రచారం జరిగింది. రష్మి ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లకు పైగానే అయింది. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో సందడి చేస్తోంది. అంతకు ముందు కొన్ని సినిమాలు కూడా చేసింది ఈమె.సుడిగాలి సుధీర్‌తో ఈమెకు ఎఫైర్ ఉందని ప్రచారం బాగానే జరిగింది. ఇప్పటికీ వాళ్ళ మధ్య ఏదో ఉంది.. ఏదో నడుస్తుంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వండుతూనే ఉంటారు. అయితే అదంతా కేవలం ప్రోగ్రాం రేటింగ్ కోసమే చేశారని.. స్క్రిప్టులో భాగంగానే అవన్నీ ఉంటాయని అందరూ చెప్పేమాట.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.