Sudigali Sudheer : కొత్త షో కు సుడిగాలి సుధీర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

 Authored By prabhas | The Telugu News | Updated on :2 June 2022,10:00 am

Sudigali Sudheer  : మల్లెమాల మరియు ఈటీవీకి సుడిగాలి సుధీర్ దాదాపుగా గుడ్ బై చెప్పేసినట్లే. గత కొన్ని వారాలుగా జబర్దస్త్‌ లో కనిపించని సుడిగాలి సుధీర్ వచ్చే వారం నుండి శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సుధీర్‌ కనిపించడం లేదు. ఇప్పటికే హైపర్ ఆది జబర్దస్త్‌ ను వీడాడు. వీరిద్దరు కూడా పారితోషికం ఇష్యూ కారణంగానే బయటకు వెళ్లారు అనేది చాలా మంది బలంగా చెబుతున్న మాట. అసలు విషయం ఏంటీ అనేది వారు ఇద్దరు మాట్లాడితే కాని ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.హైపర్ ఆది ఈటీవీ జబర్దస్త్‌ ను వీడి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు మరే ఇతర కామెడీ షో ల్లో కూడా కనిపించడం లేదు.

కాని సుధీర్ మాత్రం అప్పుడే సూపర్ సింగర్స్ జూనియర్ స్టార్‌ మా కార్యక్రమంలో యాంకర్ గా చేస్తున్నాడు. స్టార్‌ మా వారు చాలా కాలంగా సుడిగాలి సుధీర్ ను తమ ఛానల్‌ లో కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. రెండు మూడు సంవత్సరాలుగా భారీ పారితోషికం ఇచ్చేందుకు సైతం ముందుకు వచ్చింది. జబర్దస్త్‌ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక్క షెడ్యూల్‌ కు నాలుగు లక్షల వరకు మల్లెమాల వారు పారితోషికం ఇచ్చే వారట.ఇప్పుడు స్టార్‌ మా వారు ఏకంగా ఒక్క షెడ్యూల్‌ కు ఆరున్నర నుండి ఏడు లక్షల పారితోషికం ఇస్తున్నారని..

sudigali sudheer remuneration for star maa tv show

sudigali sudheer remuneration for star maa tv show

గతంలో అనసూయ కంటే సుధీర్ పారితోషికం ఈటీవీలో తక్కువ ఉండేది. కాని ఇప్పుడు మాత్రం సుధీర్ పారితోషికంతో పోల్చితే అనసూయ పారితోషికం చాలా తక్కువగా సూపర్ సింగర్స్ కార్యక్రమానికి ఇస్తున్నారట. ఇంత భారీగా పారితోషికం ఇవ్వడం వల్లే స్టార్‌ మాకు సుధీర్‌ జాయిన్‌ అయ్యాడు. త్వరలోనే కామెడీ స్టార్స్ లో కూడా సుధీర్‌ ఎంట్రీ ఇస్తాడని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సుడిగాలి సుధీర్‌ లేని ఈటీవీ జబర్దస్త్‌ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ పరిస్థితి దారుణం ఉంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి