
Sudigali Sudheer re entry time fixed
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. చిన్న స్థాయి నుంచి సుధీర్ ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు బుల్లితెరపై స్టార్‌గా మారిపోయాడు. సుధీర్ అంటే బుల్లితెరపై ఓ బ్రాండ్‌లా మారిపోయాడు. సుధీర్ ఫాలోయింగ్ చూస్తే ఎవ్వరికైనా దిమ్మతిరిగిపోవాల్సిందే. సైడ్ ఆర్టిస్ట్ నుంచి టీం లీడర్‌గా ఎదిగిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై వెలిగిపోయేందుకు రెడీ అవుతున్నాడు. కానీ సినిమాల్లో సుధీర్ రాణించలేకపోతోన్నాడు. హీరోగా నిలదొక్కుకోలేకపోతోన్నాడు. బుల్లితెరపైనే సుధీర్ డిమాండ్ ఎక్కువగా ఉంది. బుల్లితెరపై ఆల్ రైండర్‌గా సుధీర్ నిరూపించుకున్నాడు.
ఆటలు, పాటలు, యాక్షన్స్, మిమిక్రీ, హెస్ట్, యాంకరింగ్ ఇలా అన్నింట్లోనూ సుధీర్ తన మార్క్ చూపించాడు. డ్యాన్సుల్లో సుధీర్ గ్రేస్.. పాటలు పాడటంతో సుధీర్ ఫీల్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలా సుధీర్ రష్మీ కోసం పాడే పాటలు, వేసే స్టెప్పులు అందరినీ మెప్పిస్తుంటాయి. ఇది వరకు చాలా సార్లే రష్మీ కోసం స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు సుధీర్. అతను పాడిన పాటలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో సాహసం చేశాడు. ప్రస్తుతం సుధీర్ స్టార్ మాలో సింగింగ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే షోలో అనసూయ కూడా కో హోస్ట్‌గా ఉంది.
Sudigali Sudheer Sings Like Chitra in Star Maa Singing Show
మనో, చిత్రలు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో సుధీర్ తాజాగా అందరినీ మెప్పించాడు. సింగర్ చిత్ర ఓ కంటెస్టెంట్‌తో కలిసి పాట పాడుతుంది. చిత్ర పాడిన ఎవర్ గ్రీన్ సాంగ్స్‌లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే రెయిన్ సాంగ్ స్పెషల్. అయితే ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వాన.. అనే ఈ పాటను కంటెస్టెంట్ పాడుతుంటే.. చిత్ర కూడా అందుకుంటుంది. అదే పాటను అదే ఫీమేల్ వాయిస్‌లో పాడేందుకు సుధీర్ ప్రయత్నిస్తాడు. సుధీర్ ఆడవాయిస్‌లో చిత్రలా పాడేందుకు ప్రయత్నిస్తాడు. ఇక చిత్ర సైతం సుధీర్‌తో కలిసి ఈ పాటను పాడుతుంది.మొత్తానికి సుధీర్ మాత్రం ఓ మాదిరిగా పాడినా మెప్పించేశాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.