Sudigali Sudheer : నైటంతా హోట‌ల్‌లో అమ్మాయితో… సుడిగాలి సుధీర్ మాట‌లు విని అంతా షాక్…!

Authored By Sam C | The Telugu News | Published on: February 16, 2022, 10:00 am

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్… ఇప్పుడు బుల్లితెర‌కు మెగాస్టార్ గా మారాడు. ఎంద‌రు ఉన్నా అందులో సుడిగాలి సుధీర్ ఉంటే ఆ కిక్కే వేరు అనేలా మారింది. అన్ని స్కిట్స్ కూడా దాదాపు సుడిగాలి సుధీర్ చుట్టే తిరుగుతుంటాయి. జ‌బర్ధ‌స్త్ షోలో సుడిగాలి సుధీర్ ని ‘’లా, అమ్మాయిల పిచ్చోడిలా చిత్రీకరించడం ఎన్నో సార్లు చూశాం. పార్టిసిపెంట్స్ మొదలుకొని, జడ్జ్ రోజా వరకు అమ్మాయిల విషయమై సుధీర్‌పై పరోక్షంగా పంచులేయడం కామన్ అయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్ట్‌గా ఉన్నా కూడా సుధీర్‌పై పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. అయితే తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో కనిపించిన ఓ సీన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.

సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో గెటప్ శ్రీను, సుధీర్‌ సంభాషణ హైలైట్ అయింది.వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అన్ని టీమ్‌లు తమ తమ స్కిట్లతో తెగ సందడి చేశాయి. మరీ ముఖ్యంగా ఇందులో సుడిగాలి సుధీర్ బృందం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పంచులతో ప్రసాద్.. ప్రత్యేకమైన మేనరిజంతో శ్రీను.. తనదైన కామెడీతో సుధీర్ అల్లరి చేయడం ప్రత్యేకంగా నిలిచింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో.. గెటప్ శ్రీను సుధీర్‌తో ‘నేను ఇచ్చిన ఐదు వేలు ఏం చేశావ్’ అని ప్రశ్నిస్తాడు.

sudigali sudheer stunning comments in viral

sudigali sudheer stunning comments in viral

Sudigali Sudheer : త‌న‌పైనే తెగ పంచ్‌లు వేసుకుంటున్నాడుగా..

దానికి సుధీర్ ఇచ్చిన స‌మాధానం అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేసింది.. ‘ఆఫీస్ నుంచి వస్తుంటే అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఇద్దరం వెళ్తుండగా ఫుల్ వర్షం వచ్చింది. దీంతో హోటల్ రూమ్ తీసుకుని నైటంతా ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం’ అంటూ ఊహించని విధంగా డైలాగులు చెప్పాడు. ఫ్యాన్స్ షాక్.. అలాంటివి వద్దని జబర్ధస్త్ కమెడియన్‌గా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. కొన్ని స్కిట్లలో దిగజారి తనపై తానే పంచులు వేసుకుంటున్నాడు. ఈ కామెంట్స్ పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp