Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కూడా వెళ్లిపోతే జబర్దస్త్ కు దిక్కు ఎవరు?
Sudigali Sudheer : తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన జబర్దస్త్ కార్యక్రమం దాదాపు ఏడు సంవత్సరాల పాటు దిగ్విజయంగా సాగింది. తెలుగు బుల్లి తెర పైనే కాకుండా సౌత్ ఇండియన్ బుల్లి తెరపై ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. సౌత్ ఇండియన్ లో ఏ బుల్లి తెర కార్యక్రమానికి కూడా ఈ స్థాయిలో రేటింగ్ రాలేదు అన్నంతగా జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కు రెగ్యులర్గా రేటింగ్ వచ్చింది. అంతటి జబర్దస్త్ మెల్ల మెల్లగా ప్రభావం కోల్పోతుంది అనిపిస్తుంది. ఒకప్పుడు టీవీ లో ఎక్కువ మంది జబర్దస్త్ షో చూసేవారు, ఇప్పుడు ఫోన్ లో యూట్యూబ్ లో జబర్దస్త్ లో చూస్తున్నారు. సరే యూట్యూబ్ లో అయినా జబర్దస్త్ లో చూస్తున్నారు కదా అని అనుకుంటున్న సమయంలో అక్కడ కూడా మెల్ల మెల్లగా ప్రేక్షకులు తగ్గుతున్నారు.
ఒకప్పుడు హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ టీం లు చేసిన కామెడీ ఎపిసోడ్ల ను మిలియన్ల కొద్దీ అభిమానులు చూసేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య చాలా దారుణంగా పడిపోయింది. ఇప్పటికే హైపర్ ఆది వెళ్ళిపోవడం తో పాటు పలువురు కమెడియన్స్ కూడా వెళ్ళి పోయారు. దాంతో జబర్దస్త్ గురించిన చర్చ తగ్గుతోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సుడిగాలి సుదీర్ టీం కూడా జబర్దస్త్ ఈ కార్యక్రమాన్ని వదిలే అవకాశం ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సుడిగాలి సుధీర్ టీమ్ లో విభేదాలు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వివాదాల వల్ల జబర్దస్త్ ను సుడిగాలి సుధీర్ కూడా వీడే సమయం ఆసన్నమైందంటూ జబర్దస్త్ అభిమానులకు పిడుగులాంటి వార్త ఒకటి అందుతుంది.
ఆ వార్త నిజం కాకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పటికే హైపర్ ఆది కనిపించకుండా పోయారు.. మరెంతోమంది కామెడియన్స్ కూడా జబర్దస్త్ వీడారు. ఈ సమయంలో సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ ను వీడితే పరిస్థితి ఏంటి అంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. జబర్దస్త్ టీం ఇప్పటికే కొత్త వారిని తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వారి ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. గతంలో వచ్చిన స్థాయి కమెడియన్స్ రావడం లేదు. సుడిగాలి సుదీర్ టీం కూడా జబర్దస్త్ న వీడితే ఖచ్చితంగా మల్లెమాల వారు జబర్దస్త్ కార్యక్రమాన్ని ఎత్తివేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.