sudigali sudheer trying to re join in jabardasth with help of minister roja
Sudigali Sudheer : ఈటీవీ జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని.. ఆ తర్వాత బయటికి వెళ్లిన వారు చాలా మంది బయటకు వెళ్లినందుకు బాధపడ్డారు, మళ్ళీ వచ్చేందుకు ప్రయత్నించారు. అన్ని విషయాలు తెలిసి కూడా జబర్దస్త్ నుండి ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. ఇటీవల బుల్లి తెర స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ని వీడి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఈటీవీ మల్లెమాల వారు జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సుధీర్ కి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఒక మ్యాజిక్ చేసుకునే కుర్రాడు ఇప్పుడు బుల్లి తెర స్టార్ గా వెండి తెరపై అప్‌కమింగ్ స్టార్ అనిపించుకుంటున్నాడు అంటే కచ్చితంగా మల్లెమాల వారి దయ అనడంలో సందేహం లేదు.
అంత చేసినా కూడా మల్లెమాల జబర్దస్త్ ని సుడిగాలి సుదీర్ వీడి వెళ్ళి పోయాడు. అక్కడ ఏదో గొప్పగా సాధిద్దాం అనుకుని వెళ్లిన సుధీర్ కి దూరపు కొండల్లో నులుపు అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టార్ మా లో కి వెళ్ళిన వెంటనే సుధీర్ కి హామీ ఇచ్చిన నిర్మాతలు మరియు ఛానల్ యాజమాన్యం వారు మొహం చాటేసారట. షో రేటింగ్ రావడం లేదంటూ కామెడీ స్టార్స్ కార్యక్రమం పూర్తిగా రద్దు చేశారని సమాచారం అందుతుంది. ఇప్పుడు సుదీర్ చేతిలో ఒక్కటి అంటే ఒక్క షో కూడా లేదు. దాంతో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ కెరీర్ ముందుకు తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు.
sudigali sudheer trying to re join in jabardasth with help of minister roja
ఈ సమయంలోనే మళ్ళీ ఈటీవీలో రీఎంట్రీ ఇవ్వాలని ఆసక్తి చూపిస్తున్నాడట, మల్లెమాల వారి నుండి విడిపోయిన తర్వాత మళ్లీ వెళ్లడం దాదాపు అసాధ్యం. అందుకే రోజా ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజాకు మల్లెమాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా ఆమె మంత్రి అవడం వల్ల కూడా ఇప్పుడు ఆమె మాట నెగ్గె అవకాశం ఉంది. కనుక రోజా వద్ద సన్నిహిత సంబంధం ఉన్న సుడిగాలి సుదీర్ ఆమె ద్వారా మళ్లీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట. అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు ఒకసారి బయటికి వెళ్లిన వారిని అస్సలు రానివ్వరు అనే టాక్ ఉంది. మరి సుడిగాలి సుదీర్ విషయంలో ఆయన పంతం వీడతారా.. మంత్రి రోజా మధ్యవర్తిత్వం ఫలించి సుడిగాలి సుదీర్ కి మళ్ళీ జబర్దస్త్ లో చోటు దక్కుతుందా అనేది చూడాలి.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.