Sudigali Sudheer : జబర్దస్త్‌లో రీఎంట్రీకి సుడిగాలి సుధీర్ ప్రయత్నాలు.. రోజా మధ్యవర్తిత్వం ఫలించేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : జబర్దస్త్‌లో రీఎంట్రీకి సుడిగాలి సుధీర్ ప్రయత్నాలు.. రోజా మధ్యవర్తిత్వం ఫలించేనా?

Sudigali Sudheer : ఈటీవీ జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని.. ఆ తర్వాత బయటికి వెళ్లిన వారు చాలా మంది బయటకు వెళ్లినందుకు బాధపడ్డారు, మళ్ళీ వచ్చేందుకు ప్రయత్నించారు. అన్ని విషయాలు తెలిసి కూడా జబర్దస్త్ నుండి ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. ఇటీవల బుల్లి తెర స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ని వీడి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఈటీవీ మల్లెమాల వారు జబర్దస్త్ మరియు శ్రీదేవి […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 September 2022,6:30 pm

Sudigali Sudheer : ఈటీవీ జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని.. ఆ తర్వాత బయటికి వెళ్లిన వారు చాలా మంది బయటకు వెళ్లినందుకు బాధపడ్డారు, మళ్ళీ వచ్చేందుకు ప్రయత్నించారు. అన్ని విషయాలు తెలిసి కూడా జబర్దస్త్ నుండి ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. ఇటీవల బుల్లి తెర స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ని వీడి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఈటీవీ మల్లెమాల వారు జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సుధీర్ కి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఒక మ్యాజిక్ చేసుకునే కుర్రాడు ఇప్పుడు బుల్లి తెర స్టార్ గా వెండి తెరపై అప్‌కమింగ్ స్టార్ అనిపించుకుంటున్నాడు అంటే కచ్చితంగా మల్లెమాల వారి దయ అనడంలో సందేహం లేదు.

అంత చేసినా కూడా మల్లెమాల జబర్దస్త్‌ ని సుడిగాలి సుదీర్ వీడి వెళ్ళి పోయాడు. అక్కడ ఏదో గొప్పగా సాధిద్దాం అనుకుని వెళ్లిన సుధీర్ కి దూరపు కొండల్లో నులుపు అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టార్ మా లో కి వెళ్ళిన వెంటనే సుధీర్ కి హామీ ఇచ్చిన నిర్మాతలు మరియు ఛానల్ యాజమాన్యం వారు మొహం చాటేసారట. షో రేటింగ్ రావడం లేదంటూ కామెడీ స్టార్స్ కార్యక్రమం పూర్తిగా రద్దు చేశారని సమాచారం అందుతుంది. ఇప్పుడు సుదీర్ చేతిలో ఒక్కటి అంటే ఒక్క షో కూడా లేదు. దాంతో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ కెరీర్ ముందుకు తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు.

sudigali sudheer trying to re join in jabardasth with help of minister roja

sudigali sudheer trying to re join in jabardasth with help of minister roja

ఈ సమయంలోనే మళ్ళీ ఈటీవీలో రీఎంట్రీ ఇవ్వాలని ఆసక్తి చూపిస్తున్నాడట, మల్లెమాల వారి నుండి విడిపోయిన తర్వాత మళ్లీ వెళ్లడం దాదాపు అసాధ్యం. అందుకే రోజా ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజాకు మల్లెమాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా ఆమె మంత్రి అవడం వల్ల కూడా ఇప్పుడు ఆమె మాట నెగ్గె అవకాశం ఉంది. కనుక రోజా వద్ద సన్నిహిత సంబంధం ఉన్న సుడిగాలి సుదీర్ ఆమె ద్వారా మళ్లీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట. అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు ఒకసారి బయటికి వెళ్లిన వారిని అస్సలు రానివ్వరు అనే టాక్‌ ఉంది. మరి సుడిగాలి సుదీర్ విషయంలో ఆయన పంతం వీడతారా.. మంత్రి రోజా మధ్యవర్తిత్వం ఫలించి సుడిగాలి సుదీర్ కి మళ్ళీ జబర్దస్త్ లో చోటు దక్కుతుందా అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది