Sudigali Sudheer : జబర్దస్త్‌కు రాకముందు అలాంటి పనులు చేశాడా?.. సుడిగాలి సుధీర్ వీడియో
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర సూపర్ స్టార్‌గా సుధీర్ దూసుకుపోతోన్నాడు. అయితే సుధీర్ వెండితెరపై మాత్రం మ్యాజిక్ చేయలేకపోతోన్నాడు. బుల్లితెరపై వర్కవుట్ అయిన సుధీర్ కామెడీ.. వెండితెరపై తేలిపోతోంది. అందుకే సుధీర్ ఇప్పుడు మొత్తంగా బుల్లితెరపైనే ఫోకస్ పెడుతున్నాడు. అయితే ఇప్పుడు సుధీర్ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోను నిలబెట్టేశాడు. అతగాడి వల్లే షో బాగా హిట్ అయింది.
అయితే ప్రతీవారం కొత్త కొత్త కాన్సెప్టులతో ముందుకు వస్తున్నారు. అయితే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా వదిలారు. ఇందులో యమలీల సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌ను తీసుకున్నారు.
సుడిగాలి సుధీర్ యమలీల అన్నట్టుగా చూపించారు. సినిమాలో ఆలీకి బుక్కు దొరికితే.. ఇక్కడ సుధీర్‌కు దొరుకుతుంది. అది తెరిచి చూడగానే సుధీర్‌కు దిమ్మతిరిగింది. జబర్దస్త్‌కు రాక ముందు ఎలాంటి పనులు చేసేవాడివి అని ఉంది.
Sudigali Sudheer : సుధీర్ యమలీల అంటూ రచ్చ..
ఇక టాయిలెట్లు కడగడం, కార్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులను చేసుకుంటూ కాలాన్ని గడిపాడు అని చూపించాడు. అలా తన గతాన్ని చూసుకుని ఒక్కసారిగా బెదిరిపోయాడు. ఇంకో రెండు గంటల్లో చచ్చిపోతాను అని తన ఫ్యూచర్ గురించితెలసుకున్నాడు సుధీర్. అలా మొత్తానికి యమలీల సినిమాను గుర్తుకు చేశారు. సినిమా విడుదలై 27 ఏళ్లు అయిన సందర్భంగా ఇలా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో స్పెసల్ పర్ఫామెన్స్ చేశారు.