Rashmi Gautam : రష్మి గౌతమ్ పెళ్లి వార్తలపై సుడిగాలి సుధీర్‌ ఏమంటున్నాడు!

Authored By Himanshi | The Telugu News | Published on: January 26, 2022, 2:00 pm

Rashmi Gautam : జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి పెళ్లి అయ్యింది అంటూ వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్‌ మంచాల శ్రీనివాస్ రష్మి పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆ విషయం జబర్దస్త్‌ టీమ్‌ లో కూడా చాలా మందికి తెలుసు అనేది ఆయన విశ్లేషణ. పెళ్లి అయినా కూడా సుధీర్ తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవుతుంది కనుక అలా అలా కొనసాగిస్తున్నారు అనేది ఆయన విశ్లేషణ. ఆ విషయం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదు. కాని తాజాగా లాక్ డౌన్ సమయంలో రష్మి పెళ్లి చేసుకుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. రష్మి పెళ్లి విషయంలో మీడియాలో వస్తున్న వార్తల విషయంలో అస్సలు క్లారిటీ లేదు. ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటూ వెళ్తున్నారు.

ఈ సమయంలో సుడిగాలి సుధీర్ స్పందిస్తే ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలువురు సుధీర్‌ ను సోషల్‌ మీడియా ద్వారా మరియు ఫోన్ ద్వారా అన్న రష్మి పెళ్లి అయ్యిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎప్పటిలాగే సుధీర్ ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. ఈ సమయంలో ఆయన నుండి ఏదైనా స్పందన.. క్లారిటీ వస్తే బాగుంటుంది అంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాని సుధీర్ మాత్రం పెద్దగా రెస్పాండ్‌ అవ్వడం లేదు. రష్మి గురించిన ఇలాంటి విషయాల్లో సుధీర్ అస్సలు రెస్పాండ్‌ అవ్వడు. ఎందుకంటే సుధీర్‌ గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏం అనుకున్నా కూడా అతడు ఒక జెంటిల్మన్‌. అతడు తన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించడు.

sudigali sudhir about Rashmi Gautam marriage

sudigali sudhir about Rashmi Gautam marriage

Rashmi Gautam : రష్మి మరియు సుధీర్ ల ప్రేమ విషయం…

రష్మి విషయంలో ఏ ఒక్క సారి కూడా అతి అనిపించలేదు. కారనంగా ఏంటీ అంటే సుధీర్‌ ప్రతి సారి కూడా అతడి కళ్లలో ప్రేమను చూపిస్తూ వచ్చాడు. ఎప్పుడు కూడా అతడు ఆమెపై ప్రేమ తగ్గింది అన్నట్లుగా చూడలేదు. అది స్క్రిప్టెడ్ అయినా మరేదైనా కూడా సుధీర్‌ చూసే చూపు మాత్రం మారలేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా అతడిని అభిమానించడం మొదలు పెట్టారు. రష్మి తో పాటు సుధీర్ ఉండాలని ప్రతి ఒక్కరు ఒకప్పుడు కోరుకునే వారు. కాని ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్కడే చేస్తున్నా కూడా జనాలు ఆధరిస్తున్నారు అంటే కారణం అతడికి పెరిగిన ఆధరణ. అలాంటి సుధీర్ తన బుల్లి తెర కెమిస్ట్రీ రష్మి పెళ్లి విషయమై ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp