Sukumar : పుష్ప 2 1000 రోజులు కూడా సరిపోలేదా.. సుకుమార్ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాడా..?
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే ఈ ఆగష్టుకే రిలీజ్ ప్లాన్ చేసినా టైం సరిపోదని సుకుమార్ డిసెంబర్ దాకా తీసుకున్నాడు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ లాక్ చేశారు. ఐతే పుష్ప 2 రిలీజ్ కు సరిగ్గా చెప్పాలంటే 22 రోజుల టైం మాత్రమే ఉంది. కానీ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు సరికదా ఎడిటింగ్ కూడా జరుగుతుందని టాక్. సుకుమార్ కి 1000 రోజుల టైం ఇచ్చినా కూడా సినిమాను పూర్తి చేయలేకపోయాడు. సినిమాకు సంబందించిన స్పెషల్ సాంగ్ షూటింగ్ నడుస్తుంది. అది పూర్తయ్యాక ఎడిటింగ్ ఉంది. మరోపక్క కొన్ని సీన్స్ ఎడిటింగ్ జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తి చేసిన సుకుమార్ సెకండ్ హాఫ్ ని ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తుంది. ఫైనల్ కట్ అవ్వాలి.. ఎడిటింగ్ జరగాలి.. సుకుమార్ చూడాలి. ఇంత ప్రాసెస్ ఉంది.
సుకుమార్ అందుకే కాస్త హడావిడిగా కనిపిస్తున్నాడని తెలుస్తుంది. పుష్ప 2 రిలీజ్ టైం కి సుకుమార్ డే అండ్ నైట్ కష్టపడితే కానీ అనుకున్న డేట్ కి తీసుకొచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. అందుకే సినిమాకు దేవి ఒక్కడే మ్యూజిక్ సరిపోదని థమన్ ని కూడా తీసుకుంటున్నారు. మరి 1000 రోజుల టైం తీసుకున్నా కూడా సుకుమార్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అన్నది మాత్రం అర్ధం కావట్లేదు.
Sukumar : పుష్ప 2 1000 రోజులు కూడా సరిపోలేదా.. సుకుమార్ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాడా..?
ఇదంతా సినిమా మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. సుకుమార్, అల్లు అర్జున్ ఎలా అనుకున్నారో అలానే పుష్ప 2 వచ్చేలా చూస్తున్నారు. మరి పుష్ప 2 ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే కొద్దిపాటి అంచనాలకు తగినట్టుగా ఉన్నా సినిమా రికార్డులను సృష్టిస్తుందని చెప్పొచ్చు. Allu Arjun, Sukumar, Pushpa 2, DSP, Decembar 5th, Tollywood
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.