Sukumar : ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వల్ల పాన్ ఇండియన్ దర్శకుడు సుకుమార్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారా..అంటే అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సుకుమార్ సినిమాలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. అయితే, రంగస్థలం సినిమా నుంచి సుక్కూ కూడా తన స్టైల్‌ను మార్చారు.
మాంచి కల్ట్ కంటెంట్ ఉన్న కథలను తయారు చేసుకొని పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొడుతున్నారు. రాం చరణ్, సమంతలతో తీసిన రంగస్థలం సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఓ కమర్షియల్ స్టార్ హీరోకు వినికిడి లోపంతో క్యారెక్టర్ రాయడం అది హీరోతో ఒప్పించడం సినిమాను తీసి ప్రేక్షకులను మెప్పించడం అంటే పెద్ద సాహసమే.
ఆ సాహసం చేసిన సుకుమార్ సక్సెసయ్యాడు. అందుకే, ఆ తర్వాత అల్లు అర్జున్ – రష్మిక మందల్లతో పుష్ప సిరీస్ చిత్రాలను తీసే అవకాశం దక్కింది. పార్ట్ 1తో వచ్చిన సుకుమార్, అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్ అందుకున్నారు. ఊహించని విధంగా బాలీవుడ్‌లో ఈ సినిమా 100 కోట్ల
రూపాయలను రాబట్టడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అయితే, అసలు టెన్షన్ అక్కడే మొదలైంది. బాలీవుడ్‌తో పాటుగా ఇతర భాషలలో కూడా పుష్ప 1 ఊహించని విధంగా వసూళ్ళు రాబట్టడంతో అంచనాలు రెండవ భాగం మీద భారీగా పెరిగాయి.
అదే అంచనాలు ఆర్ఆర్ఆ, కేజీఎఫ్ 2 చిత్రాలు జస్ట్ అలా క్రాస్ చేయడంతో ఇప్పుడు సుకుమార్ ముందు పెద్ద టాస్క్ అయింది. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా ఈ రెండు సినిమాల భారీ సక్సెస్ వల్ల పుష్ప పార్ట్ 2 కథలో మళ్ళీ కీలక మార్పులను చేస్తున్నారు సుకుమార్. వీటికంటే ధీటుగా ఉండేలా సుక్కు ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేస్తూ పక్కా ఫైనల్ వెర్షన్ వచ్చే వరకు శ్రమిస్తున్నారట. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి పుష్ప సీక్వెల్..అది కూడా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి సినిమాల
రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే ఈ ఒత్తిడి తప్పదు మరి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.