Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హిట్‌తో సీక్వెల్ పై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల బన్నీ గెటప్ కు సంబంధించిన అప్ డేట్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు అందుకోలేనిరేంజ్ లోకి వెళ్ళాయి. ఇక ఈసినిమాను మూడేళ్ల నుంచి చెక్కుతున్నాడు లెక్కల మాస్టారు సుకుమార్. తీసిన సీన్ తీస్తూ.. రీ షూట్ చేస్తూ.. విసిగెత్తిస్తున్నాడట. ఈమూవీని ఎలాగైనా భారీ సినిమాగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేశారు. వెయ్యికోట్లు కలెక్షన్స్ దాటించాలి, వీలైతే.. ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళాలి అని బన్నీ, సుక్కూ ప్లాన్. అందుకే చాలా జాగ్రత్తగా షూటింగ్ ప్లాన్ చేశారు.
అయితే మూడేళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నా.. ఇంకా 20 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్ లో ఉందట. ఎప్పుడో అగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమాను డిసెంబర్ 2 కు పోస్ట్ పోన్ చేశారు. కాని అప్పటికి కూడా సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అని డౌట్. సినిమా సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ ఫహద్ ఫజిల్ మలయాళ నటుడు. ఆయన అక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు ఈసినిమాకు మేజర్ షూటింగ్ ఆయన సీన్స మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పట్లో ఫహద్ డేట్స్ దొరికే అవకాశం కనిపించడం లేదు. ఉన్నప్పుడు చేసుకోలేకపోయాడట సుక్కు. దాంతో పుష్ప2 టీమ్ పెద్ద చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఇక నిర్మాతలు ఎలాగైనా ఫహద్ డేట్స్ ను సంపాదించాలని పట్టుదలతో ఉన్నారు. అక్టోబర్ లో ఫహద్ షూటింగ్ కు రాకపోతే.. డిసెంబర్ లో పుష్ప2 రిలీజ్ డౌట్ అనే చెప్పాలి.
డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కుదరకపోతే మైత్రి మూవీ మేకర్స్ తమ బ్యానర్ లో వస్తున్న నితిన్ రాబిన్ హుడ్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.నితిన్ వెంకీ కుడుముల ఈ కాంబోలో ఆల్రెడీ భీష్మ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్ కాంబో రిపీట్ చేస్తూ రాబిన్ హుడ్ చిత్రం రాబోతుండగా, ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 రిలీజ్ కష్టమే అని డిసైడ్ అయితే చిన్నగా ఈ సినిమాను డిసెంబర్ 6కి తెచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నారట. అసలైతే ఫస్ట్ క్రిస్ మస్ రేసులో రాబిన్ హుడ్ ని రిలీజ్ చేయాలని అనుకున్నారు.కాని గేమ్ ఛేంజర్ అప్పుడు వస్తుండడంతో డిసెంబర్ 6కి రాబిన్ హుడ్‌ని ప్లాన్ చేస్తున్నారట
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.