Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ పలు ఆఫర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన పించన్లు ఇప్పటికే అమలు చేయగా, మిగతావి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 2) ఆడబిడ్డ నిధి: దీని కింద 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం. 3) మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం. 4) తల్లికి వందనం ఈ పథకంలో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఉన్న తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం. ఈ 4 కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన కీలక హామీలు.
దీపావళి నుంచి మరో హామీని అమలుచేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి హమీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది.
ప్రస్తుతం వంట గ్యాస్ సిలిందర్ ధర రూ.830 ఉంది. దీనిని పూర్తి ఉచితంగా అందించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఇతర పథకాలను విడతల వారీగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి చర్చించారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటికింటీ వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. వందరోజుల పాలన ప్రగతిని “ఇది మంచి ప్రభుత్వం”పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. 100 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.