
sukumar reveals interesting details behind samantha item song in pushpa movie
samantha : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. మొదటి రోజునే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి పెట్టిన ఈ మూవీ హీరో బన్నీతో పాటు ఇందులో నటించిన యాక్టర్స్ అందరికీ మంచి పేరు తీసుకు వచ్చింది. పుష్ప రాజ్ మాస్ యాక్టింగ్ కి థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. రిలీజ్ కి ముందు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మూవీపై భారీ అంచనాలు తీసుకురాగా… చివరగా అనౌన్స్ చేసిన సామ్ స్పెషల్ సాంగ్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేసింది. తన కెరియర్ లో మొదటి సారిగా ఐటెం సాంగ్ లో నటించిన సమంత.. తన స్టెప్పులతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.
తాజాగా మూవీ దర్శకుడు సుకుమార్.. ఈ పాటలో నర్తించిన సమంతపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.థియేటర్లలో ఊ అంటావా మావా సాంగ్ ఆడియన్స్ ను సీట్లలో కుర్చోనివ్వడం లేదు. అయితే ఈ పాటలో నటించడం కోసం సమంతను ఒప్పించడానికి దర్శకుడు సుకుమార్ చాలా కష్టపడ్డడటా. ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. మొదట్లో ఊ అంటావా మావా సాంగ్ లో యాక్ట్ చేయడానికి సమంత అంగీకరించలేదని సుక్కు పేర్కొన్నారు. సామ్ ను ఒప్పించడానికి తాను చాలా కష్టపడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రంగస్థలంలో పూజాహెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ ను గుర్తు చేస్తూ.. నటి అన్నప్పుడు అన్ని రకాల పాత్రల్లో నటించగలగాలి అంటూ ఆమెను కన్విన్స్ చేశానని ఆయన తెలిపారు.
sukumar reveals interesting details behind samantha item song in pushpa movie
ఈ మాటతో సమంత ఇందుకు ఒప్పుకుంది ఆయన వివరించారు. ఇప్పుడు ఈ పాటకు ఎంత రెస్పాన్స్ వస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు.అయితే పుష్ప సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఊ అంటావా మామ… ఊ ఊ అంటావా మామపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. అదే రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి. సాంగ్ లో సమంతను మరి వల్గర్ గా చూపించారంటూ ఆమె అభిమానులు చిత్ర బృందం ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో గా నిలుస్తున్న ఈ మూవీ నైజాం లో ఇప్పటికే అన్ని పాత రికార్డులను తుడిచి వేసింది. వచ్చే ఏడాది రిలీజ్ అవ్వనున్న పార్ట్ 2 పై మరిన్ని అంచనాలను పెంచేసింది .
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.