Sukumar : సినిమాలు తియడం మానేస్తా.. సుకుమార్ సంచలన నిర్ణయం..!
ప్రధానాంశాలు:
Sukumar : సినిమాలు తియడం మానేస్తా.. సుకుమార్ సంచలన నిర్ణయం..!
Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని కెరీర్‌లో ఇప్పటివరకూ చేసింది 9 సినిమాలే అయినా చిత్రసీమపై తనదైన మార్క్ వేశారు డైరెక్టర్ సుకుమార్. ది జీనియస్, లెక్కల మాస్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే సుకుమార్ ఇటీవల పుష్ప 2తో బాక్సాఫీస్‌ని షేకాడించారు. సౌత్ టూ నార్త్ పుష్ప 2 దెబ్బకి వసూళ్లతో పాటు రికార్డులు కూడా దాసోహం అంటున్నాయి. ప్రస్తుతం ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో టాప్-3లో ఉన్నారు సుకుమార్. అయితే అతను ఇప్పుడు సినిమాలు వదిలేస్తానంటూ సంచలన కామెంట్స్ చేసి షాకిచ్చారు.
Sukumar సినిమాలు చేయడా..!
యాంకరింగ్ లో భాగంగా యాంకర్ సుమ అతిథిగా వచ్చిన సుకుమార్ ని ఒక ప్రశ్న అడిగింది. జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారు అని. ఆయన ఠక్కున సినిమా అని చెప్పేయడంతో ఒక్కసారిగా పక్కనున్న రామ్ చరణ్ షాకుకు గురై వెంటనే సుకుమార్ ను ఆప్యాయంగా నిలువరిస్తూ మైకు తీసుకుని క్లారిటీ ఇచ్చేశాడు.ఇలాగే సంవత్సరం నుంచి ఇదే మాట అంటూ భయపెడుతున్నారు, కానీ అలాంటిది ఏమి జరగదని రామ్ చరణ్ హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా సుమతో అక్కడ ఉన్న వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. పుష్ప 2 ది రూల్ లాంటి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించి బాలీవుడ్ నెంబర్ వన్ మూవీని అందించిన డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది సుకుమార్ పేరే.
రామ్ చరణ్-శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవలే అమెరికాలోని డల్లాస్‌లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. దీనికి హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్‌కి డైరెక్టర్ సుకుమార్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్‌ని యాంకర్ సుమ ఓ ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అడిగింది. కాగా, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం అరెస్ట్, బెయిల్ అంటూ ఇబ్బందుల్లో ఉండటాన్ని సుకుమార్ చూడలేకపోతున్నారని , అందుకే సినిమా మానేస్తానని అంటున్నాడని కామెంట్లు పెడుతున్నారు .
సుమ: సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? సుకుమార్ : సినిమా pic.twitter.com/fmrsM1S9pA
— ChotaNews (@ChotaNewsTelugu) December 24, 2024