Sukumar Wife : మన పెళ్లి అందుకే సక్సెస్ అయింది.. సుకుమార్ భార్య రొమాంటిక్ పోస్ట్
Sukumar Wife : సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సుకుమార్‌కు సంబంధించిన విషయాలను ఆమె నిత్యం షేర్ చేస్తుంటుంది. సుకుమార్ సెట్‌లో ఎలా ఉంటాడు.. ఇంట్లో ఎలా ఉంటాడు..పిల్లలతో టైం ఎలా గడుపుతాడు అనే విషయాలు తబిత షేర్ చేస్తుంటుంది. షూటింగ్‌లతో సుకుమార్ బిజీగా ఉంటూ.. సోషల్ మీడియాను పట్టించుకోడు. కానీ సుకుమార్ అభిమానుల కోసం తబిత ఇలా ఫుల్ యాక్టివ్ అయిపోతుంటుంది. ఇక సుకుమార్ సైతం తన భార్య గురించి సందర్భం వచ్చినప్పుడు ఎంతో గొప్పగా చెబుతుంటాడు.
పుష్ప సక్సెస్ మీట్‌తో తన భార్యకే ముందు థ్యాంక్స్ చెప్పి స్పీచు ప్రారంభించాడు. తాను లేకపోతే నేను లేనంటూ.. నాలో సగ భాగం, నా అర్థాంగి.. కాబట్టి.. నా ఈ సక్సెస్‌లో ఆమెకు భాగం ఉంది.. అంటూ భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పేస్తాడు. అది చూసిన తబిత కూడా ఎమోషనల్ అవుతుంది. ఇక పుష్ప సినిమా, సుకుమార్ గురించి ఓ సుధీర్ఘమైన పోస్ట్ వేసింది. ఇక తబిత ఎప్పుడూ కూడా సుకుమార్ మీద అమితమైన ప్రేమను కురిపిస్తుంటుంది. అందులో భాగంగా తాజాగా ఓ పోస్ట్ వేసింది. సుకుమార్, తబితల పెళ్లి జరిగి నేటికి పదమూడేళ్లు అవుతుందట. దీంతో తబిత ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ వేసింది. ఈ రోజు నిన్ను ప్రేమించినంతగా మరేతర రోజు ప్రేమించలేనేమో..

Sukumar Wife Thabitha EMotional Post On wedding Day
ఇది మన పెళ్లి రోజు.. అయితే నీ మీద మాత్రం రోజురోజుకూ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది.. మనిద్దరం ప్రతీ క్షణం.. ప్రేమలో పడుతుండటం.. ఎన్నో సార్లు ప్రేమించుకుంటూ ఉండటంతోనే మన పెళ్లి సక్సెస్ అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను.. 13 ఏళ్లు గడిచినందుకు సంతోషంగా ఉంది అంటూ తబిత ఎమోషనల్ అయింది. మొత్తానికి సుకుమార్ మాత్రం ఇప్పుడు పుష్ప పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెల చివర్లోకల్లా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఉన్నాడు సుకుమార్. ఇక ఈ చిత్రంతో మరోసారి పాన్ ఇండియన్ స్థాయిలో బన్నీ రేంజ్, సుకుమార్ స్టామినా అందరికీ అర్థమవుతుంది.