Suma Cash Show : మల్లెమాల వారికి క్యాష్ తో వచ్చే లాభం మరే షో తో రాదు.. ఎలాగో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Suma Cash Show : మల్లెమాల వారికి క్యాష్ తో వచ్చే లాభం మరే షో తో రాదు.. ఎలాగో తెలుసా?

Suma Cash Show : ఈటీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ మరియు సినిమాల కంటే కూడా ఎక్కువగా రియాల్టీ షో ల ద్వారా ఆ ఛానల్ కి మంచి రేటింగ్ నమోదు అవుతుంది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్, క్యాష్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ మరో రెండు మూడు కార్యక్రమాల వల్ల మాత్రమే ఈటీవీ మనుగడ సాధ్యమవుతుంది అంటూ చాలా మంది చెబుతున్నారు. మల్లెమాల వారు ప్రొడక్షన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుగు బుల్లి తెర […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 October 2022,9:40 pm

Suma Cash Show : ఈటీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ మరియు సినిమాల కంటే కూడా ఎక్కువగా రియాల్టీ షో ల ద్వారా ఆ ఛానల్ కి మంచి రేటింగ్ నమోదు అవుతుంది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్, క్యాష్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ మరో రెండు మూడు కార్యక్రమాల వల్ల మాత్రమే ఈటీవీ మనుగడ సాధ్యమవుతుంది అంటూ చాలా మంది చెబుతున్నారు. మల్లెమాల వారు ప్రొడక్షన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం దేశంలోనే అత్యధిక రేటింగ్ నమోదు చేసిన కార్యక్రమంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ప్రస్తుతం మంచి రేటింగ్ దక్కించుకుంటూ సూపర్ హిట్ గా మల్లెమాలకు మరియు ఈటీవీ వారికి మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయంటూ అంత భావిస్తున్నారు.

నిజమే ఆ రెండు కార్యక్రమాలు మంచి లాభాలను తెచ్చి పెడుతున్నాయి, కానీ ఆ రెండింటికి ఏమాత్రం తక్కువ కాకుండా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమం భారీ లాభాలను తెచ్చి పెడుతుంది అంటూ బుల్లి తెర వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్యాష్ కార్యక్రమం కి పెద్దగా బడ్జెట్ అక్కర్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కమెడియన్ మరియు సెటప్ అవసరం.. కానీ క్యాష్ కార్యక్రమానికి అదంతా అవసరం లేదు. కనుక మల్లెమాల వారికి ప్రొడక్షన్ కాస్ట్ భారీగా తగ్గుతుందట.

suma Cash show game show getting big profits for mallemala and etv

suma Cash show game show getting big profits for mallemala and etv

అందుకే క్యాష్ కార్యక్రమం తక్కువ బడ్జెట్ తో రూపొంది ఎక్కువ లాభాలను ఈటీవీ మరియు మల్లెమాల వారికి తెచ్చిపెడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. జబర్దస్త్ కార్యక్రమం హైదరాబాద్ లో షూటింగ్ నిర్వహించగా క్యాష్ కార్యక్రమం మాత్రం ఈటీవీ కి చెందిన రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ నిర్వహిస్తారు. కనుక అది కూడా ఖర్చు లేదు అన్నట్లుగా బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉంటారు. క్యాష్ కార్యక్రమంలో వచ్చే వారు గెస్ట్ లుగా వస్తారు. కనుక వారికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా సినిమాల ప్రమోషన్ కోసం వచ్చినందుకు వారే కొంత మొత్తంలో మల్లెమాల వారికి ఇస్తారని సమాచారం ఉంది. కనుక వాటితో పోలిస్తే క్యాష్ కార్యక్రమం కాస్త ఎక్కువగానే ఈటీవీ మల్లెమాల వారికి లాభం తెచ్చిపెడుతుంది అనడంలో సందేహం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది