Suma Cash Show : ఈటీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ మరియు సినిమాల కంటే కూడా ఎక్కువగా రియాల్టీ షో ల ద్వారా ఆ ఛానల్ కి మంచి రేటింగ్ నమోదు అవుతుంది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్, క్యాష్, శ్రీదేవి డ్రామా కంపెనీ మరో రెండు మూడు కార్యక్రమాల వల్ల మాత్రమే ఈటీవీ మనుగడ సాధ్యమవుతుంది అంటూ చాలా మంది చెబుతున్నారు. మల్లెమాల వారు ప్రొడక్షన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం దేశంలోనే అత్యధిక రేటింగ్ నమోదు చేసిన కార్యక్రమంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ప్రస్తుతం మంచి రేటింగ్ దక్కించుకుంటూ సూపర్ హిట్ గా మల్లెమాలకు మరియు ఈటీవీ వారికి మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయంటూ అంత భావిస్తున్నారు.
నిజమే ఆ రెండు కార్యక్రమాలు మంచి లాభాలను తెచ్చి పెడుతున్నాయి, కానీ ఆ రెండింటికి ఏమాత్రం తక్కువ కాకుండా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమం భారీ లాభాలను తెచ్చి పెడుతుంది అంటూ బుల్లి తెర వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్యాష్ కార్యక్రమం కి పెద్దగా బడ్జెట్ అక్కర్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కమెడియన్ మరియు సెటప్ అవసరం.. కానీ క్యాష్ కార్యక్రమానికి అదంతా అవసరం లేదు. కనుక మల్లెమాల వారికి ప్రొడక్షన్ కాస్ట్ భారీగా తగ్గుతుందట.
అందుకే క్యాష్ కార్యక్రమం తక్కువ బడ్జెట్ తో రూపొంది ఎక్కువ లాభాలను ఈటీవీ మరియు మల్లెమాల వారికి తెచ్చిపెడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. జబర్దస్త్ కార్యక్రమం హైదరాబాద్ లో షూటింగ్ నిర్వహించగా క్యాష్ కార్యక్రమం మాత్రం ఈటీవీ కి చెందిన రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ నిర్వహిస్తారు. కనుక అది కూడా ఖర్చు లేదు అన్నట్లుగా బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉంటారు. క్యాష్ కార్యక్రమంలో వచ్చే వారు గెస్ట్ లుగా వస్తారు. కనుక వారికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా సినిమాల ప్రమోషన్ కోసం వచ్చినందుకు వారే కొంత మొత్తంలో మల్లెమాల వారికి ఇస్తారని సమాచారం ఉంది. కనుక వాటితో పోలిస్తే క్యాష్ కార్యక్రమం కాస్త ఎక్కువగానే ఈటీవీ మల్లెమాల వారికి లాభం తెచ్చిపెడుతుంది అనడంలో సందేహం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.