Anchor Suma : చిరంజీవి సురేఖ మధ్య చిచ్చు పెట్టడమా?.. తెగ ప్రయత్నంచిన యాంకర్ సుమ
Anchor Suma : యాంకర్ సుమ ఎంతటి వారినైనా సరే తన మాటలతో మంత్ర ముగ్దుల్ని చేయగలదు. అయితే నిన్న జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం సుమ దుమ్ములేపేసింది. చిరంజీవి, రామ్ చరణ్‌లను స్టేజ్ మీదే నిలబెట్టి పర్సనల్ విషయాలను అడిగి.. ఏదో ఒక చిచ్చు పెట్టాలని, కాంట్రవర్సీ చేయాలని బాగానే ప్రయత్నించింది. అయితే ఇందులోంచి చిరంజీవి, రామ్ చరణ్ ఈజీగా బయటపడ్డారు.ఎవరి వంట బాగుంటుంది.. మీ అమ్మగారిదా? సురేఖా గారిదా? అని చిరంజీవిని సుమ అడుగుతుంది.
దీనికి అందరికీ ఆమోద యోగ్యమైన ఆన్సర్ చెప్పి ఆశ్చర్యపరిచాడు చిరంజీవి. ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మ ప్రేమ.. అమ్మ ముద్ద, అమ్మ వంటే అద్భుతంగా ఉంటుంది.. దాని తరువాతే ఎవరిదైనా అంటూ చెప్పేస్తాడు. ఇక సుమ కాస్త కామెడీ చేస్తుంది. అంటే మేం ఎంత కష్టపడి చేసినా కూడా క్రెడిట్ మాత్రం అత్తలకే వెళ్తుందా? అని అంటుంది సుమ.ఇక ఈ ఈవెంట్‌కు సురేఖ చివర్లో వస్తుంది. సురేఖ వచ్చిందని తెలిసిన సుమ.. చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించింది. సురేఖ గారు మీరు వచ్చారా.. మీకు అన్యాయం జరిగింది.. మీ వంట గురించి మాట్లాడారు అని చెప్పింది.

Anchor Suma Fuuny Comments On Chiranjeevi Surekha konidela
అయితే ఆ తరువాత ప్రశ్నలో మీకు ఫుల్ మార్కులు పడ్డాయనుకోండి అంటూ సుమ కామెడీ చేసింది. దీంతో సురేఖా తెగ నవ్వేసింది. అయితే రామ్ చరణ్ చెప్పిన ఓ విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.మీరు ఎక్కువగా ఎవరికి భయపడతారు.. మీ నాన్న గారికా? ఉపాసన గారికా? అని రామ్ చరణ్‌ని సుమ అడుగుతుంది. మా నాన్న గారు మా అమ్మ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటారు.. అది నేను నేర్చుకున్నాను. అందుకే ఉపాసన దగ్గర కూడా కాస్త జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేస్తాడు. మా ఇంట్లో అందరికీ మా అమ్మే బాస్ అని కూడా చరణ్ చెబుతాడు.