sumant made interesting remarks during the film promotions
Sumanth : సుమంత్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫామ్‌లో ఉన్న హీరో.. ప్రేమకథ మూవీతో అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి వంటి మూవీస్ చేసి మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పించారు. తర్వాత వరుసగా ఫ్లాప్‌లు వెంటాడటంతో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత గోల్కొండ హైస్కూల్ మూవీలో యాక్ట్ చేశాడు. ఈ మూవీ కాస్త పర్వాలేదు అనిపించింది. తర్వాత మళ్లీ రావా మూవీతో రీ ఎంట్రి ఇచ్చారు. ప్రస్తుతం మళ్లీ మొదలైంది అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.టీజీ కీర్తి కుమార్ డైరెక్షన్ వస్తున్న ఈ మూవీ ఈడీ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై రూపొందింది.
ఈ మూవీకి రాజశేఖర్ రెడ్డి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిచాడు. జీ5 ఓటీటీలో మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది. దీంతో మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుమంత్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మళ్ళీ మొదలైంది మూవీ స్టోరీ చెప్పే సమయంలో ఇది విడాకులకు సంబంధించి ఉండటంతో వెంటనే ఓకే చెప్పేశానని చెప్పుకొచ్చాడు సుమంత్. ఇలాంటి స్టోరీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అనుకున్నానని చెప్పాడు.
sumant made interesting remarks during the film promotions
డైవర్స్ తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో లవ్ లో పడితే ఎలా ఉంటుంది అనే స్టోరీ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీలో సుమంత్ వైఫ్‌గా వర్షిణీ సౌందర్ రాజన్ యాక్ట్ చేయంగా.. న్యాయవాది క్యారెక్టర్‌లో నైనా గంగూలీ నటించింది. మరి చాలా గ్యాప్ తర్వాత సుమంత్ ఈ మూవీ చేయడంతో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ మూవీ తప్పనిసరిగా హిట్ కొడుతుందని మూవీ యూనిట్ ధీమాతో ఉంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.