Sunil : నెగెటివ్ షేడ్స్‌లో పిచ్చెక్కించబోతున్న సునీల్.. ఆయన యాక్టింగ్‌కు అల్లు అర్జున్ ఫిదా..

Authored By mallesh | The Telugu News | Published on: December 13, 2021, 2:20 pm

Sunil : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ నెల 17న పార్ట్ వన్ విడుదల కానుంది. ఇకపోతే ఇందులో భారీతారాగణమే ఉంది. విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నారు. కమెడియన్, హీరోగా సక్సెస్ అయిన సునీల్ ప్రజెంట్ విలక్షణమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ‘మంగళం శ్రీను’గా సునీల్ యాక్టింగ్ వేరే లెవల్‌లో ఉండబోతుందని మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

‘పుష్ప’ సినిమాలో సునీల్ యాక్టింగ్ ప్లస్ డైలాగ్ డెలివరీ, డిక్షన్ వెరీ డిఫరెంట్‌గా ఉండబోతున్నాయని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. గతంలో కమెడియన్‌గా నటించిన సునీల్ హీరోగానూ పలు సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. కాగా, ఇటీవల కాలంలో సునీల్ విలక్షణమైన పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ‘పుష్ప’లో మంచి రోల్ ప్లే చేశారని మూవీ యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే డబ్బింగ్ టైంలో తాను సునీల్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యానని బన్నీ సుకుమార్‌కు చెప్పారని టాక్.నెగెటివ్ షేడ్‌లో సునీల్ ఇరగ దీశాడని, ఈ సినిమాలో ఆయనకు జోడీగా ‘దాక్షాయణి’గా అనసూయ భరద్వాజ్ చాలా బాగా నటించిందని తెలుస్తోంది.

sunil played important role in pushpa film

sunil played important role in pushpa film

Sunil : సునీల్ సూపర్బ్‌గా పర్ఫార్మెన్స్ చేశాడంటున్న బన్నీ..

ట్రైలర్‌లో సునీల్ చెప్పిన ‘కట్ట మీద కూసోని ఎవరైనా చెప్తారు.. లోతు దిగితే తెలుసుద్ది అబ్బా’ అంటూ డిఫరెంట్ డిక్షన్‌లో సునీల్ డైలాగ్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘పుష్ప’ సినిమాకు మ్యూజిక్ దేవి శ్రీప్రసాద్ అందించగా, సినిమాటోగ్రఫీ కుబా చేశారు. ఇక ఇందులో ఐకాన్ స్టార్ బన్నీ సరసన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ హీరోయిన్ రష్మిక మందన నటించింది. ఈ పిక్చర్ ద్వారా బన్నీ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబోలో గతంలో ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు వచ్చాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp