Home » Entertainment » Sunny And Manas About Nomitaions In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : ఎర్రి పూ.. అయిపోయాం.. మానస్‌తో సన్నీ ముచ్చట్లు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 10, 2021, 6:50 pm
Advertisement

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో పదో వారం నామినేషన్ ప్రక్రియ మంజు రంజుగా సాగింది. ఎవరు నామినేట్ అవుతారా? అని చివరి వరకు కంటెస్టెంట్లు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే రవి, సిరి, శ్రీరామచంద్ర మాస్టర్ ప్లాన్లు వేశారు. కానీఅందులో సిరి, రవి బోల్తా పడ్డారు. కాజల్‌ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన శ్రీరామ్ ఆటను మలుపు తిప్పాడు. ఇక అక్కడ సిరిని కాపాడతాను అని మాటిచ్చిన కాజల్.. దెబ్బకు యూటర్న్ తీసుకుంది. షన్నుని కాపాడింది. అయితే ఈ విషయంలో మానస్, సన్నీ హర్ట్ అయ్యారు.

Advertisement

Sunny And Manas About Nomitaions In Bigg Boss 5 Telugu

షన్నుని కాజల్ బయటకు తీసుకురావడంతో చిచ్చు మొదలైంది. నీకు మమ్మల్ని కాపాడే చాన్స్ ఉన్నప్పుడు ఎందుకు కాపాడలేదు.. మా ఇద్దరిలోంచి ఎవరినో ఒకరిని ఎందుకు బయటకు తీసుకురాలేదంటూ కాజల్‌తో సన్నీ, మానస్‌లు అన్నారు. లాస్ట్ వీక్ నా కోసం లెటర్ త్యాగం చేశాడు.. నామినేట్ అయ్యాడు.. అందుకే ఈ వారం సేఫ్ చేశాను అంటూ కాజల్ తన నిర్ణయం గురించి తాను చెప్పుకుంది. అయినా కూడా మానస్, సన్నీలు వినలేదు.

Advertisement

Bigg Boss 5 Telugu : నామినేషన్లో మానస్, సన్నీ..

Bigg Boss 5 Telugu

అందరూ కలిసి మనల్ని ఎర్రి పూ.. చేశారు కదా? అంటూ సన్నీ, మానస్‌లు ముచ్చట్లు పెట్టుకున్నారు. నాక్కూడా కాజల్, ప్రియాంక అంటే ఏంటో తెలిసిపోయింది. ఇక ఇద్దరమే ఉందాం.. ఉంటే ఉంటా.. పీకితే పీకుతాం అంటూ సన్నీ, మానస్‌లు నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఈ పదో వారం నామినేషన్ ప్రక్రియ మాత్రం మామూలుగా లేదు. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు అన్నట్టుగా జరిగింది. చివరకు రవి, సిరి, కాజల్, మానస్, సన్నీలు నామినేట్ అయ్యారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి