Krishna : టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 350కు పైగా సినిమాలలో నటించిన ఆయన ఇండస్ట్రీలో చిరస్థాయిగా మిగిలారు. ఆయన ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశారు. తెలుగు సినిమా రంగాన్ని కొత్త మార్గం పట్టించారు. ఈస్ట్ మాన్ కలర్ ను ఆయనే పరిచయం చేశారు. సినిమా స్కోప్ ను కూడా ఆయనే పరిచయం చేశారు. అంతేకాదు చాలా సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. సినిమా రంగంలో పోటీ పడాలని, ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని పదే పదే చెప్పేవారు. ముఖ్యంగా కృష్ణ అన్నగారు ఎన్టీఆర్ తో చాలా పోటీపడి నటించేవారు. ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఒకే ఏడాది నాలుగు సినిమాలు చేసి మూడు సినిమాలతో హిట్ అందుకొని ఒకటి ఫ్లాప్ అందుకున్నారు.
హిట్ అయిన మూడింటిలో శ్రీకృష్ణ పాండవీయం ఒకటి. ఈ విషయం కృష్ణకు తెలిసింది. దీంతో వెంటనే ఏడాదికి ఎనిమిది సినిమాలను చేయాలని ప్రకటించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ 8 సినిమాలు చేస్తున్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి డేట్లు కూడా ఇచ్చారు. వీటిలో ఒకే రోజు నాలుగు సినిమాలు విడుదల చేస్తున్నట్టు కూడా ముందుగానే ప్రకటించారు. అసలు కథ కూడా రెడీ కాకుండానే కృష్ణ 8 సినిమాలను ప్రకటించారు. అవి సంక్రాంతి రోజు వస్తున్నట్టు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ వార్తపై అనేక విమర్శలు వచ్చాయి. కథ లేదు, డైరెక్టర్ లేడు ఒకేసారి సినిమాలు ప్రకటించడం ఏంటి అని అన్నగారు కూడా నవ్వుకున్నారు.
అయినా కృష్ణ పట్టు బట్టి మరీ దర్శకులతో మాట్లాడి 3 నెలలకు రెండు సినిమాలు పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలా వచ్చిన 8 సినిమాల్లో 7 సూపర్ హిట్ కావడం గమనార్హం. అంతేకాదు సాధారణంగా సంక్రాంతి రోజు వివిధ హీరోల సినిమాలు వచ్చేవి. కానీ, ఆ ఏడాది మాత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు, మూడు సినిమాలు హీరో కృష్ణవే కావడం గమనార్హం. అందులో ఒక సినిమా విజయ నిర్మల దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కూడా హిట్టయ్యాయి. ఇలా అన్నగారితో పోటీ పడి మరీ కృష్ణ విజయం దక్కించుకున్నారు. ఆ ఏడాది అన్నగారిపై కృష్ణ తన సినిమాలతో పై చేయి సాధించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.