Mahesh Babu : ఆయన బయోపిక్ నేను చేయను… కానీ ప్రొడ్యూస్ చేస్తా.. క్లారిటీ ఇచ్చిన మహేశ్ బాబు
Mahesh Babu : టాలీవుడ్ అందగాడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అంటే చాలు ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. ఎంతో దూకుడుగా నటించే ఈ బాబుకి సరిలేరు నీకెవ్వరు.. అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. నిజానికి మహేశ్ ఓ కథ ఓకే చేశారంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.. ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఫస్ట్ లుకుతో మొదలు పెడితే పోస్టర్.. టీజర్.. సాంగ్స్..సినిమా ఫంక్షన్..థియేట్రికల్ ట్రైలర్ ఇలా ఒక్కటేమిటీ బోలడన్ని సప్రైజ్ లు ఇస్తుంటే.. ఫ్యాన్స్ అదే రేంజ్ లో ప్రతీ సప్రైజ్ కి రెట్టింపుగా ట్రెండింగ్ లో ఉంచుతారు. పోకిరితో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సూపర్ స్టార్ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
అయితే దర్శకధీరుడు జక్కన్న కాంబినేషన్ లో సూపర్ స్టార్ నటిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో మహేశ్ బాబు ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటనున్నారు. ప్రస్తుతం పరశురాం డైరెక్షన్ లో మహేశ్ బాబు నటించిన మూవీ సర్కారు వారి పాట.. ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్తగా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ తోనే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా అలరించనుంది. దీంతో ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రికార్డుల బద్దలు కొట్టడం ఖాయమన్నట్లు అనిపిస్తోంది.

superstar krishna His biopic Clarity given by Mahesh Babu
కాగా అడవి శేష్ హీరోగా నిటిస్తున్న చిత్రం మేజర్. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో మేజర్ పాత్రలో అడవి శేష్ అద్బుతంగా నటించినట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను మహేశ్ బాబు రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. అయితే ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ చేస్తారా అని ప్రశ్నించగా స్పందించారు. అయితే నేను తీయను కానీ.. ఎవరైనా బయోపిక్ తీస్తే మొదటగా సంతోషించేది నేనేనని అన్నారు. అవసరమైతే ప్రొడ్యూస్ కూడా చేయడానికి రెడీగా ఉన్నట్లు ఆయన మనసులోని మాట చెప్పేశారు. దీంతో ఓ క్లారిటీ రావడంతో ఇక కృష్ణ బయోపిక్ పై పలువురు దర్శకులు ఫోకస్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు.