Big Breaking : తుది శ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ..!!
Big Breaking : సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. నిన్న కార్డియాక్ అరెస్ట్ తో గచ్చిబౌలిలోనే కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ కావడం తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించడం జరిగింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంతో మునిగిపోయారు.
ఓకే ఏడాదిలో మూడు మరణాలు సంభవించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. విషయం తెలిసిన అభిమానులు మరియు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దాదాపు ఒకరోజు పాటు హాస్పిటల్ లో ఉన్న కృష్ణనీ బతికించుకోవడం కోసం ప్రపంచ స్థాయి వైద్యుల చేత చికిత్స అందించారు. అయినా గాని ప్రాణం దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
దాదాపు 350కి పైగా సినిమాలు చేసి నటుడిగా, నిర్మాతగా మరియు ఇంక దర్శకుడిగా కూడా రాణించడం జరిగింది. కృష్ణా మరణంతో కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. సినిమాలో మాత్రమే కాకుండా రాజకీయరంగంలో కూడా రాణించడం జరిగింది. దీంతో కృష్ణ మరణంతో చాలామంది రాజకీయ నాయకులూ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.