Home » Entertainment » Supritha Surekha Vani Daughter Post Viral In Internet
Entertainment

Supritha : సురేఖవాణి కూతురి లవ్ స్టోరి.. ఎక్కడి వరకు వచ్చిందంటే..?

Authored By
mallesh
The Telugu News | Published on: January 22, 2022, 8:30 pm
Advertisement

Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టగా, దానిపై నెటిజన్లు స్పందించారు.‘ఐ సెయిడ్ యెస్’ అంటూ సుప్రీత ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో కొందరు సుప్రిత నిజంగానే యెస్ చెప్పిందా? దేని యెస్ చెప్పింది? అని కొందరు అనుకున్నారు.కానీ, చాలా మంది మాత్రం ఇది ఒక ప్రమోషనల్ స్ట్రాటలజీ అని కామెంట్స్ చేశారు.

Advertisement

అలా సుప్రిత ఏదో విధంగా క్రియేట్ చేయాలనుకున్న లవ్ స్టోరికి బ్రేక్ పడిందని చెప్పొచ్చు. మొత్తంగా జనాలను ఏదో విధంగా ఆటపట్టిద్దామని అనుకున్న సుప్రిత స్ట్రాటజీ వర్కవుట్ అయితే కాలేదు. ఇటువంటి ట్రిక్స్, జిమిక్స్ అన్నిటినీ చాలా మంది సెలబ్రిటీలు ఫాలో అయ్యారు. దాంతో సుప్రిత స్ట్రాటజీ వర్కవుట్ కానట్లుంది. ఇంతకీ ఆ విధంగా ఆమె ఎందుకు పోస్ట్ పెట్టిందంటే..సురేఖా వాణి కూతురు సుప్రిత ‘యెస్’ చెప్పడానికి గల కారణం.. ప్రైవేట్ ఆల్బమ్.

supritha surekha vani daughter post viral in internet

Advertisement

Supritha : వెరీ ఓల్డ్ స్ట్రాటజీలోనే సుప్రిత..

‘వెళ్లిపో’ అనే మ్యూజికల్ ఆల్బం రాబోతుండగా, దానికి యెస్ చెప్పింది సుప్రిత. ఈ నేపథ్యంలోనే మరింత ఆసక్తి పెంచేందుకుగాను అలా పోస్టు పెట్టింది. తాజాగా ‘వెళ్లిపో’ మ్యూజికల్ ఆల్బమ్ కు సంబంధించిన పోస్టర్ షేర్ చేసింది. త్వరలో ‘వెళ్లిపో’ మ్యూజికల్ వీడియో రాబోతున్నట్లు సుప్రిత తెలిపింది. ఈ మ్యూజికల్ ఆల్బమ్‌తో సుప్రితకు ఏ మేరకు పేరు వస్తుందో చూడాలి మరి.. ఇకపోతే సుప్రిత ఎలాగూ మ్యూజికల్ ఆల్బమ్ చేస్తున్నది. కాబట్టి త్వరలో వెండితెరకు కూడా పరిచయం అవుతుందనే పోస్టులు కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్నారు. కాగా, అవకాశం సిల్వర్ స్క్రీన్ పైన మెరిసేందుకుగాను సుప్రిత రెడీగానే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి