Upasana : మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె మెగా కోడలిగా,రామ్ చరణ్ సతీమణిగా అందరి మన్ననలు పొందుతూ ఉంటుంది. చిరంజీవి ఇంట్లో జరిగే శుభ కార్యాలు, పండుగలు, ఇతర ఈవెంట్లకు సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ లేపుతుంటుంది. అయితే ఆ వీడియోలలో వారి మధ్య అనుబంధాలను స్పూర్తిగా తీసుకొంటారు.ఇక ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యామిలీలో జరిగే వేడుకలకి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అవి చూసి మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు అనేవి ఉండవు.ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
సురేఖ పుట్టిన రోజు సందర్భంగా మెగా కోడలు ఉపాసన ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అత్త కోడళ్లు కలిసి ప్రీ కుక్‌డ్ ఫుడ్, ఇన్‌స్టంట్ మిక్స్‌లు తయారు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే సమ్మర్ సందర్భంగాద వారు నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ చేశారు. మెగా కోడలు ఉపాసన సురేఖ మామిడి కాయ పచ్చడిని కలిపే సమయంలో వీడియో తీసింది. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మొదటగా చిరంజీవి తల్లి అంజనా దేవి కనిపిస్తారు. అప్పుడు ఉపాసన ఆమె దగ్గరకు వెళ్లి ‘ మీరు ఎందుకు నాయనమ్మ సీరియస్ గా ఉన్నారు’ అని అంజనాదేవిని అడుగుతుంది. దీనికి ఆమె పని లేక ఇక్కడ కూర్చున్నాను’ అంటూ పంచ్ వేస్తుంది.
ఇక ఆతర్వాత మీ కోడలు మంచిగా పికెల్(ఊరగాయ) చేయడం లేదా? అని అత్తపై ఫిర్యాదు చేస్తుంది ఉపాసన. అందుకు ప్రతిగా అంజనమ్మ .. ‘నువ్వున్నావ్ కదా.. మళ్లీ కోడలికి ఎందుకు పని? అని సరదాగా కౌంటర్ ఇస్తారు.ఆ తర్వాత తన అత్త సురేఖని వీడియో తీస్తుంది ఉపాసన. అత్తమ్మ దగ్గరకు వెళ్లి ‘క్యా హో రా’ అని అడగ్గా.. తనకు హిందీ రాదని నవ్వేసింది సురేఖ. ఆ తర్వాత వెల్కమ్ టు ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఆ వీడియో చివర్లో తెలపడం మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ఉపాసన తన ఫ్యామిలీతో కలిసి ఇంత సంతోషంగా ఉండడం మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.