Surekha Vani : నెట్టింట్లో సురేఖా వాణి నంబర్.. అప్రమత్తమైన నటి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Surekha Vani : నెట్టింట్లో సురేఖా వాణి నంబర్.. అప్రమత్తమైన నటి

Surekha Vani : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన అందాల ముద్దుగుమ్మ సురేఖా వాణి. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది. ఆమెతో పాటు ఆమె త‌న‌య సుప్రిత కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌తో ఇద్ద‌రూ హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు. వీరు చేసే ప‌నికి కొంద‌రు ట్రోల్ చేసినా, వీరివురూ త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ పోతున్నారు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 March 2022,8:00 pm

Surekha Vani : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన అందాల ముద్దుగుమ్మ సురేఖా వాణి. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది. ఆమెతో పాటు ఆమె త‌న‌య సుప్రిత కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌తో ఇద్ద‌రూ హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు. వీరు చేసే ప‌నికి కొంద‌రు ట్రోల్ చేసినా, వీరివురూ త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ పోతున్నారు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ ప‌డే లుక్స్ ఆమెవ‌ని సోష‌ల్ మీడియాలో ఫొటోలు చూసిన వారే చేసే కామెంట్స్ చేస్తున్నారు.

త‌న కుమార్తె కంటే సురేఖా వాణినే అందంగా క‌న‌ప‌డుతున్నార‌ని కొంద‌రు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ స‌మ‌యంలో కూతురు సుప్రిత‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో ఈమె చేసిన హ‌ల్ చ‌ల్ ఈమెకు మ‌రింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి.అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖా వాణికి పెద్ద షాక్ త‌గిలింది. సురేఖా వాణి ఫోన్ నెంబ‌ర్ అంటూ ఆమె అభిమానుల‌ని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు కొంద‌రు కేటుగాళ్లు. దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయిన సురేఖా వాణి అది త‌న నెంబ‌ర్ కాద‌ని, ఎవ‌రు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయోద్ద‌ని కోరింది.

surekha vani

surekha vani

Surekha Vani : అల‌ర్ట్ చేసిన సురేఖా వాణి

ఇటీవ‌ల అనుప‌మ‌కి కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ఓ నంబర్ షేర్ చేసి.. ఇది తనది కాదంటూ, అందరూ జాగ్రత్తగా ఉండండి అని అనుపమ చెప్పుకొచ్చింది. ఆ నంబర్ నుంచి ఫోన్స్, మెసెజ్ వచ్చినా రిప్లై ఇవ్వద్దని తన అభిమానులను అలర్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది.. ఇటీవల అనుపమ రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.ఇక సురేఖా వాణి విష‌యానికి వస్తే ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం సినిమాలు లేకపోయిన సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది