Home » Entertainment » Surekha Vani Daughter Supritha About Her Marriage
Entertainment

Supritha : అప్పుడే పెళ్లి చేసుకుంటాను.. నెటిజన్‌కు సుప్రిత ఘాటు సమాధానం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 6, 2022, 9:00 pm
Advertisement

Supritha : సురేఖా వాణి కూతురు సుప్రిత పెళ్లి మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.ఇక సురేఖా వాణి రెండో పెళ్లి కూడా నెట్టింట్లో ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. అయితే సుప్రిత మాత్రం తన తల్లి రెండో పెళ్లి మీద వచ్చే రూమర్లను తిప్పి కొడుతుంటుంది. తన మీద వచ్చే రూమర్ల మీదా సుప్రిత స్పందిస్తుంది. అయితే ఆ మధ్య సుప్రిత తన ప్రైవేట్ ఆల్బమ్ ప్రమోషన్స్‌లో కాస్త హద్దులు దాటింది. ఐ సెయిడ్ యస్ అంటూ ఓ పోస్ట్ వేసింది. అందులో ఓ అబ్బాయితో ఎంతో క్లోజ్‌గా కనిపించింది సుప్రిత. అయితే అవన్నీ ప్రమోషనల్ స్టంట్లేనని అందరూ కనిపెట్టేశారు.

Advertisement

కానీ దాంతో పాటుగా ఆమె పెళ్లి వార్తలు, లవ్ స్టోరీలు నెట్టింట్లో చక్కర్లు కొట్టేశాయి. సురేఖా వాణి కూతురి పెళ్లి.. ప్రేమలో ఉంది.. ఇతనే అబ్బాయి అంటూ ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అవి చిలికి చిలికి గాలి వానలా మారుతుందని గ్రహించిన సుప్రిత వెంటనే తన తప్పు తెలుసుకుంది. లైవ్‌లోకి వచ్చి అసలు విషయాన్ని చెప్పింది. ఇదంతా ఆల్బమ్ ప్రమోషన్స్‌లో భాగంగా చేశాం.. నేను ఎవ్వరినీ ప్రేమించడం లేదు.. నాకు లవర్ లేడు.. పెళ్లి చేసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి తన పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.  తాజాగా సుప్రిత తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేసింది.

Surekha vani Daughter Supritha About Her marriage

Advertisement

ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నలు సంధించారు. అయితే తాను ఈ మధ్య ఎక్కువగా ఫోటోలను షేర్ చేయడం లేదు, వెకేషన్లకు వెళ్లినా కూడా ఫోటోలను పెట్టడం లేదు.. దీనిపై ఓ నెటిజన్ అడిగాడు. ఎందుకు ఇలా ఫోటోలను షేర్ చేయడం లేదని ప్రశ్నించాడు. అవును.. ఇకపై నా జీవితాన్ని కాస్త ప్రైవేట్‌గా ఉంచుకోవాలని అనుకుంటున్నట్టు పేర్కొంది. ఇక మరో నెటిజన్ నీ పెళ్లి ఎప్పుడు అని అడిగేశాడు. దానికి సుప్రిత వింత సమాధానం చెప్పింది. టైమ్ వచ్చినప్పుడు అంటూ భలే తప్పించుకుంది. కానీ పెళ్లి ఎప్పుడు అనే విషయం మాత్రం అందరూ అడుగుతూనే ఉంటారు. మరి ఆమె ఈ గుడ్ న్యూస్‌ను ఎప్పుడు చెబుతుందో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి